నేపథ్యగాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇంతకాలం తన గాన మాదుర్యంతో ఆకట్టుకున్న సింగర్ సునీతకు ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పనక్కరలేదు. ఇప్పటికే ఆమెకు అనేక సినిమా ఆఫర్లు వచ్చినా ఆమె ఒప్పుకోలేదు. సునీతతో నటింపజేస్తే సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుందని భావించిన దర్శకుడు శేఖర్‌కమ్ముల ఆమధ్య తన సినిమా ‘అనామిక’ కొరకు ఆమెను ఒప్పించాడు. ‘అనామిక’ ప్రమోషనల్ సాంగ్ కోసం చిత్రీకరించిన సాంగ్‌లో ఆమెను నటింపజేశాడు. తాజాగా ఆమెను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తను మహేష్‌బాబుతో తీయబోయే ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోని ఓ కీలకపాత్ర కోసం సునీతను అంగీకరింపజేశాడని తెలుస్తోంది. మొత్తానికి మహేష్ ‘బ్రహోత్సవం’ చిత్రానికి సునీత ఓ స్పెషల్ అట్రాక్షన్ కానుంది.