ఎప్పుడు వివాదాలతో సహవాసం చేసే లోకనాయకుడు కమల్‌హాసన్ తాను నటించిన ‘ఉత్తమవిలన్’ విడుదలను అనేక సార్లు వాయిదా వేశాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో పోటీపడాలని నిర్ణయించి తర్వాత డేట్ మార్చుకున్నాడు. ఆ తర్వాత కూడా ‘ఓకే బంగారం’తో పోటీ పడాలనుకున్నాడు. కానీ చివరకు సోలో సినిమాగా బరిలో నిలబడాలని భావించి మే 1వ తేదీని ఖరారు చేసుకున్నాడు. అయితే ఈ చిత్రానికి ఆ రోజు ఇతర తమిళ సినిమాలు ఏవీ పోటీ కానప్పటికీ తెలుగులో మాత్రం కమల్‌కు బాలయ్య విలన్‌గా మారాడు. అదే రోజున ‘ఉత్తమ విలన్’తో పాటు బాలయ్య ‘లయన్’ రానుంది. ఇప్పటికే తమిళంలో రోజుకో వివాదంతో ఇబ్బందులు పడుతున్న కమల్ సింహం పంజాకు ఎదురెళ్తున్నాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా ఎలా ఉన్నా సరే బాలకృష్ణ చిత్రం అంటే ఓ వారం రోజులు థియేటర్లు కిటకిటలాడుతాయి. మరి ‘లయన్’ దెబ్బకు ‘ఉత్తమవిలన్’ నిలుస్తాడో లేదో వేచిచూడాల్సివుంది....!