Advertisementt

బిబిఎస్ స్టూడియో నిర్మిస్తున్న హాలివుడ్ చిత్రం

Wed 22nd Apr 2015 10:29 PM
bbs studio hollywood movie,director pridhvi sunain joro,producer sri laxman murari  బిబిఎస్ స్టూడియో నిర్మిస్తున్న హాలివుడ్ చిత్రం
బిబిఎస్ స్టూడియో నిర్మిస్తున్న హాలివుడ్ చిత్రం
Advertisement
Ads by CJ

ప్రముఖ యువదర్శక నిర్మాత శ్రీలక్ష్మణ్ మురారి ( బాబి), ప్రఖ్యాత హాలివుడ్ నిర్మాణ సంస్థప్రిస్వెస్ స్టూడియోతో కలిసి ఒక హాలివుడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

గతం లోపలు తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మణ్ మురారి ( బాబి) గారుగత కొన్ని సంవత్సరాలు గా హాలివుడ్ లో“ మై సోల్ మేట్ ” , “ జిమ్మీ షైన్-1968 ” లాంటి ఫీల్ గుడ్ సినిమాలను రూపొందించిన ప్రముఖ దర్శకులు “ పృద్వీ సునైన్ జోరో”దర్శకత్వం లో ఒక అధ్బుతమైన కథాంశం తో “ మదర్, ఐ ఫ్లె అవే ”అనే ఒకసోషియో, సైకలజికల్ థ్రిల్లర్ నేపధ్యంలో ఒక హాలివుడ్ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు..

దర్శకుడు పృద్వీ సునైన్ జోరో మాట్లాడుతూ..... 38 సంవత్సరాలుగా మెదడు ఆగిపోయిన గర్భిని స్త్రీ,  తన గర్భం లోనే వున్నధనుకుంటున్న శిశువుతో కలిసి సాగిస్తున్న ప్రయాణమే ఈ సినిమా కథాంశం ,, ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రుపొందనున్న ఈ చిత్రం పూర్తిగా అమెరికాలోని, లాస్ఎంజిలాస్ లోనే షూటింగ్ జరుపుకోనున్నది, పూర్తిగా హాలివుడ్ తారలతోనే నిర్మిస్తున్నారు .

యువ దర్శక నిర్మాత శ్రీ లక్ష్మణ్ మురారి ( బాబి)మాట్లాడుతూ.. దర్శకుడు పృద్వీ సునైన్ జోరో తో తనకి 10 సంవతరాల అనుభంధం వున్నదని, దర్శకుడి గత చిత్రాలన్నీ కొత్త, కొత్త కాన్సెప్ట్ తోవున్నాయని. ఈ “ మదర్, ఐ ఫ్లె అవే ” చిత్రం కూడా సెంటిమెంట్, ఇండియన్స్ ఎమోషన్స్ దగ్గరగా ఉంటుందని తెలిపారు.

దర్శకుడు “పృద్వీ సునైన్ జోరో” ఎన్నోసంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడిన తెలుగు సంతతికి చెందినవాడు..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ