Advertisementt

'ఓకే బంగారం' సక్సెస్ మీట్..!

Fri 24th Apr 2015 02:30 AM
dulquer salman,dil raju,maniratnam,ok bangaram  'ఓకే బంగారం' సక్సెస్ మీట్..!
'ఓకే బంగారం' సక్సెస్ మీట్..!
Advertisement
Ads by CJ

దుల్కర్ సల్మాన్, నిత్య మేనన్ జంటగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై మణిరత్నం దర్సకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం 'ఓకే బంగారం'. ఇటీవల విడుదలయిన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ "ఈ సినిమా విడుదలయ్యి వారం రోజులు అయింది. అన్ని థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. యూత్ కి ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అయింది. రెహ్మాన్ మ్యూజిక్, పి.సి.ఫోటోగ్రఫీ హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ "నా సినిమా తెలుగులో డబ్ ఇంతటి ఘన విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మణి సర్ కి నా ధన్యవాదాలు" అని చెప్పి కొంత సమయం విలేకర్లతో ముచ్చటిస్తూ వారి ప్రశ్నలకు జవాబులిచ్చారు.

మణిరత్నం సినిమా చేయడం ఎలా అనిపించింది..?

ఒక అద్రుష్టంగా భావిస్తున్నాను. స్క్రిప్ట్ కూడా నచ్చింది. మణిరత్నం గారు బాగా తీస్తారనే నమ్మకంతో ఓకే చేసాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన ఆయనకీ మనస్పూర్తిగా థాంక్స్ చెప్తున్నాను. ఆయన ఏదో సినిమా చేయాలి అని చేయరు. చాలా క్లారిటీ గా ఉంటారు. ప్రతి డైలాగ్ విషయంలో చాలా డిటైల్డ్ గా ఉంటారు.

'ఓకే బంగారం' మమ్ముట్టి గారు చూసారా..?

నాన్నగారు ఈ సినిమా చూసి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు. ఆయకు ఏజ్ పెరిగిన హార్ట్ దగ్గర మాత్రం చాలా యంగ్. ఆయనకి ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మూవీ కి బాగా కనెక్ట్ అయ్యారు.

ఈ సినిమాలో మీ ఫేవరెట్ సీన్..?

'హే అమాయక' సాంగ్ నాకు చాలా నచ్చింది. మణిరత్నం గారు షూటింగ్ స్టార్ట్ చేయడమే పాటలతో స్టార్ట్ చేసారు.

నిత్యతో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

నిత్యతో ఇది నాకు మూడవ సినిమా. తను చాలా టాలెంటెడ్ పెర్సన్. స్పాంటేనియస్ యాక్ట్రస్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ