Advertisementt

‘ఎంతవాడు గానీ..’ ఆడియో రిలీజ్‌

Fri 24th Apr 2015 02:40 AM
yenthavadu gani movie,ajith kumar,trisha,anushka,gautham menon  ‘ఎంతవాడు గానీ..’ ఆడియో రిలీజ్‌
‘ఎంతవాడు గానీ..’ ఆడియో రిలీజ్‌
Advertisement
Ads by CJ

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న కోలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అజిత్‌కుమార్‌ హీరోగా, గ్లామర్‌ బ్యూటీస్‌ త్రిష, అనుష్క హీరోయిన్స్‌గా శ్రీసాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై మెస్మరైజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌మీనన్‌ దర్శకత్వంలో ఎస్‌.ఐశ్వర్య తమిళంలో నిర్మించిన చిత్రం ‘ఎన్నై అరిందాల్‌’. ఈ చిత్రం తమిళంలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవాడుకానీ’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు భారీ నిర్మాత ఎ.ఎమ్‌.రత్నం. యువ సంచలన సంగీత కెరటం హారిస్‌ జయరాజ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఏప్రిల్‌ 23న హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో చిత్ర ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌, ‘కిక్‌’ సురేందర్‌రెడ్డి, ప్రముఖ నిర్మాత అనీల్‌ సుంకర, ‘సూపర్‌హిట్‌’ అధినేత, ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు వేదికపై ఆశీనులవ్వగా ఎ.ఎమ్‌.రత్నం ఫ్లవర్‌ బొకేలతో అతిథులకు స్వాగతం పలికారు.

ప్రముఖ దర్శకుడు ‘కిక్‌’ సురేందర్‌రెడ్డి ‘ఎంతవాడుకానీ’ ఆడియో సీడిని ఆవిష్కరించి తొలి సీడిని ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌కి అందించారు. సోనీ మ్యూజిక్‌ ద్వారా ఆడియో విడుదలైంది.

కిక్‌ సురేందర్‌రెడ్డి: ఎ.ఎమ్‌.రత్నంగారు నిర్మించిన చిత్రాలన్నా, ఆయన అన్నా నాకు చాలా ఇష్టం. ఫ్యూచర్‌లో ఆయనతో కలిసి ఒక సినిమా చెయ్యాలనుకుంటున్నాను. ఎ.ఎమ్‌.రత్నంగారు నిర్మించిన ‘జెంటిల్‌మేన్‌’ చిత్రం నుండి ఆయన అభిమానిగా మారాను. ఈ సినిమా తమిళంలో చాలా పెద్ద హిట్‌ అయింది. తెలుగులో కూడా ఇంకా పెద్ద హిట్‌ అయి రత్నంగారు మరిన్ని తెలుగు స్ట్రెయిట్‌ చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను.

హీరో గోపీచంద్‌: నాన్నగారు రూపొందించిన ఎన్నో చిత్రాలకు ఎ.ఎమ్‌.రత్నంగారు వర్క్‌ చేసారు. అప్పట్నుంచీ రత్నంగారితో అతి సన్నిహితంగా వుండేవాడ్ని. ఆయన కమల్‌హాసన్‌, రజనీకాంత్‌లతో భారీ సినిమాలు తీసి పెద్ద హిట్స్‌ సాధించారు. రీసెంట్‌గా తమిళంలో అజిత్‌ హీరోగా రెండు చిత్రాలు నిర్మించారు. ఆ రెండూ కూడా సూపర్‌హిట్స్‌ అయ్యాయి. మళ్ళీ అజిత్‌తోనే మూడవ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులో పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

అనీల్‌ సుంకర: ఎ.ఎమ్‌.రత్నంగారు నిర్మించిన చిత్రాలన్నీ చాలా భారీతనంతో స్టైలిష్‌గా వుంటాయి. ఆయన ఏం చేసినా పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో చేస్తారు. ఆయన నిర్మించిన చిత్రాలకి ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ రాసి సక్సెస్‌ అయ్యారు. అలాగే ఆయనకి మాటలు రాయగల సామర్ధ్యం కూడా వుంది. చాలారోజుల తర్వాత ఎ.ఎమ్‌.రత్నంగారు రూపొందించిన ‘ఎంతవాడుకానీ’ చిత్రం సూపర్‌హిట్‌ అవ్వాలి.

ఎ.ఎమ్‌.రత్నం: అజిత్‌ హీరోయిజంతో కాకుండా కథను బట్టి సినిమాకి టైటిల్‌ పెట్టమన్నారు. అందుకే ఈ చిత్రానికి తమిళంలో ‘ఎన్నై అరిందాల్‌’ టైటిల్‌ పెట్టడం జరిగింది. తమిళంలో ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. ఫస్ట్‌ నాకు అజిత్‌తో వైజాగ్‌లో పరిచయం అయ్యింది. ఆయన హీరోగా నటించిన ‘ప్రేమలేఖ’ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్‌ చేశాం. అది మంచి విజయాన్ని సాధించింది. అప్పట్నుంచీ అజిత్‌గారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడిరది. మళ్ళీ రెగ్యులర్‌గా తెలుగు సినిమాలు చేస్తాను. తమిళ్‌ ఇండస్ట్రీలో రత్నంగారు అజిత్‌తో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అని అందరూ అంటున్నారు. కానీ కథ నచ్చి అజిత్‌గారు మా బేనర్‌లో సినిమాలు చేస్తున్నారు అని అందరికీ వివరణ ఇచ్చాను. గౌతమ్‌ వాసుదేవ్‌మీనన్‌ ఒక స్టైలిష్‌ డైరెక్టర్‌. ఆయన సెంటిమెంట్‌తో పాటు అందరికీ నచ్చేలా స్టైలిష్‌గా సినిమాలు తీస్తారు.  ఆయన చిత్రాలన్నీ చాలా పెద్దహిట్‌ అయ్యాయి. హారిస్‌ జయరాజ్‌తో చాలా సినిమాలు చేసాను. అవన్నీ మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. సెవెన్‌ ఇయర్స్‌ గ్యాప్‌ తర్వాత గౌతమ్‌, హారిస్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా వచ్చింది. సినిమాతో పాటు మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అయింది. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా గ్యారెంటీగా నచ్చుతుందనే నమ్మకం వుంది.

బి.ఎ.రాజు: ఎ.ఎమ్‌.రత్నంగారు అంటే పెద్ద భారీ నిర్మాత అని అందరికీ తెలుసు. దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో సక్సెస్‌లు సాధించారు. తమిళంలో ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయ్యింది. తెలుగులో కూడా పెద్ద హిట్‌ అవుతుంది.

అజిత్‌కుమార్‌, అరుణ్‌ విజయ్‌, త్రిష, అనుష్క, వివేక్‌, అనిక సురేంద్రన్‌, సుమన్‌, ఆశిష్‌ విద్యార్థి, అవినాష్‌, పార్వతీనాయర్‌, నాజర్‌, డానియేల్‌ బాలాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఘంటసాల రత్నకుమార్‌, కెమెరా: డాన్‌ మకర్తూర్‌, సంగీతం: హరీస్‌ జయరాజ్‌,  ఎడిటింగ్‌: ఆంథోనీ, ఆర్ట్‌: రాజీవన్‌, పాటలు: ఎ.ఎం.రత్నం, శివగణేష్‌, స్టంట్స్‌: సిల్వ, డాన్స్‌: బృందా, సతీష్‌, అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: ఎ.రఘురామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.ఎం.జోతికృష్ణ, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ్‌మీనన్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ