రణధీర్, గౌతమి జంటగా శివమణిదీప్ ప్రొడక్షన్స్ పతాకంపై సంపత్‌రాజ్ దర్శకత్వంలో త్రిపుర సత్యనారాయణ నిర్మిస్తున్న ‘రాముడు మంచి బాలుడు’(తూచ్) చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లోని క్లబ్ రిపబ్లిక్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సింగర్ బాబా సెహగల్ ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
వరుణ్ సందేశ్: ఈ సినిమాలో రణధీర్ చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. అతను మంచి పెర్‌ఫార్మర్. ఈ సినిమా అతనికి మంచి పేరు తెస్తుంది.
గౌతమి: తమిళ్‌లో కొన్ని సినిమాలు చేశాను. తెలుగులో నాకు ఇదే మొదటి సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. మిమ్మల్ని ఈ సినిమా తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది.
కృష్ణుడు: రణధీర్ నెగెటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్స్ బాగా చేస్తాడు. భవిష్యత్తులో గోపీచంద్‌లాంటి మాస్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ: రాముడు మంచి బాలుడు చాలా మంచి టైటిల్. పాటలు చాలా బాగున్నాయి. తప్పకుండా అందరికీ నచ్చుతాయి. ఈమధ్యకాలంలో వస్తున్న చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇలాంటి చిన్న సినిమాలు ఇంకా రావాల్సి వుంది.
సంపత్‌రాజ్: నేను ఇండస్ట్రీకి వచ్చింది డైరెక్టర్ అవ్వాలని. అయితే కెమెరామెన్‌గా కొన్ని సినిమాలు చేశాను. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యే అవకాశం దొరికింది. యూనిట్‌లోని అందరి కోఆపరేషన్‌తో నేను అనుకున్న విధంగా సినిమా వచ్చింది. పాటలు చాలా బాగుంటాయి. విజువల్‌గా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. సత్యనారాయణ: మా బేనర్‌లో చేస్తున్న మొదటి సినిమా ఇది. అలాగే మా డైరెక్టర్‌కి, హీరోయిన్‌కి కూడా ఇదే తొలి సినిమా. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలన్న మా ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను.
ఇంకా ఈ ఆడియో ఫంక్షన్‌లో చలాకి చంటి, అనిల్, ఆదర్శ్, రాహుల్, విజయ్ మాట్లాడుతూ ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించి యూనిట్‌లోని అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.