బొద్దుగుమ్మ హన్సిక మళ్లీ తెలుగులో తళుక్కున మెరవబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమె ఈసారి నారా రోహిత్ సరసన నటించబోతోందని సమాచారం. తమిళంలో విజయవంతమైన మాన్ కరాటే తెలుగులో రీమేక్ అవ్వబోతోంది. అందులో నారా రోహిత్ కథానాయకుడిగా నటించబోతున్నారు. తమిళ మాతృకలో కథానాయికగా నటించిన హన్సికనే తెలుగులోనూ నటించబోతోందట. మురుగదాస్ కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తమిళంలో ఘన విజయం సాధించింది. ఆ సినిమా రీమేక్ హక్కుల్ని `జోరు` నిర్మాతలు అశోక్, నాగార్జున సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. `గుండెల్లో గోదారి` ఫేమ్ కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో తెలుగులో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. నారా రోహిత్, హన్సిక జోడీ అదిరిపోయే అవకాశాలున్నాయని టాలీవుడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రోహిత్ ఇటీవల బొద్దుగా తయారయ్యాడు. హన్సిక కూడా అదే తరహాలోనే కనిపిస్తుంది. వీరి జోడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.