Advertisementt

‘బాహుబలి’ మళ్ళీ వాయిదా..!!

Wed 29th Apr 2015 05:02 AM
baahubali postponed,baahubali trailer on 31 may,rana,anushka,prabhas,tamanna,baahubali news,   ‘బాహుబలి’ మళ్ళీ వాయిదా..!!
‘బాహుబలి’ మళ్ళీ వాయిదా..!!
Advertisement
Ads by CJ

 

ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా కీలక పాత్రధారులుగా రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా మొదటి భాగాన్ని  మే 15 విడుదల చేస్తామని గత నెలలో రాజమౌళి వెల్లడిరచారు. అయితే  విజువల్‌ ఎఫెక్ట్‌ ్స పని పూర్తికానందు వల్ల సినిమా రిలీజ్‌ వాయిదా పడుతుందని రాజమౌళి స్పష్టం చేశారు. మంగళవారం ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ పేజీల ద్వారా ఈ విషయాన్ని వెల్లడిరచారు. మే 31న పక్కాగా ప్రేక్షకుల కోసం ట్రైలర్‌ని విడుదల చేస్తామనీ, అదే కాకుండా మే 1 నుంచి 31 వరకు సినిమాలో కీలక పాత్రధారులు పోస్టర్‌లను విడుదల చేస్తామన్నారాయన. 17 స్టూడియోల్లో 600 మంది విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం పనిచేస్తున్నారనీ అయినప్పటికీ అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాలేదని ఆయన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను జులైలో విడుదల చేస్తునట్లు జక్కన తెలిపారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు సమర్పకుడు. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ నిర్మాతలు.