Advertisementt

కిక్కిచ్చే పాట‌లు వినేందుకు రెడీనా?!

Mon 04th May 2015 02:06 AM
kick 2 audio on 9,kick 2 news,raviteja,rakul preeth singh,kick 2 audio date confirmed  కిక్కిచ్చే పాట‌లు వినేందుకు రెడీనా?!
కిక్కిచ్చే పాట‌లు వినేందుకు రెడీనా?!
Advertisement
Ads by CJ
ర‌వితేజ టైమ్ స్టార్ట‌వుతోంది. ఒక‌ప‌క్క `బెంగాల్ టైగ‌ర్‌` సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉంటూనే... మ‌రోప‌క్క `కిక్‌2` చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేసుకొంటున్నాడు. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `కిక్‌2` సినిమాలోని గీతాలు ఈ నెల 9న విడుద‌ల కాబోతున్నాయి. హైద‌రాబాద్‌లో అట్ట‌హాసంగా పాట‌ల వేడుక‌ని నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఆ విష‌యాన్ని చిత్ర‌బృందం కూడా ధ్రువీక‌రించింది. క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్‌రామ్ త‌న ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లో నిర్మిస్తున్న చిత్ర‌మిది. రవితేజ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్‌సింగ్ న‌టించింది. ఇదివ‌ర‌కు సురేంద‌ర్‌రెడ్డి, ర‌వితేజ కాంబినేష‌న్‌లో రూపొందిన `కిక్‌`కి కొన‌సాగింపుగా ఈ చిత్రం తెర‌కెక్కింది. డబుల్ కిక్కిచ్చే వినోదాలు ఈ చిత్రంలో ఉంటాయ‌ని సినిమా బృందం చెబుతోంది. త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. మ‌రి కిక్కిచ్చే పాట‌ల్ని ఆస్వాదించ‌డానికి మీరు రెడీనా?
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ