Advertisementt

'దాగుడుమూత దండాకోర్' విడుదలకు సిద్ధం..!

Wed 06th May 2015 02:09 AM
dagudumoota dandakore,may 9th release,rajendhraprasad,dil raju,krish  'దాగుడుమూత దండాకోర్' విడుదలకు సిద్ధం..!
'దాగుడుమూత దండాకోర్' విడుదలకు సిద్ధం..!
Advertisement
Ads by CJ
‘గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్‌’ లాంటి చిత్రాల సృష్టికర్త క్రిష్‌ సమర్పణలో రాజేంద్రప్రసాద్, బేబీ సారా ప్రధాన పాత్రల్లో ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై రామోజీరావు నిర్మిస్తున్న సినిమా 'దాగుడుమూత దండాకోర్'.  ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు ముగించుకొని ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ "తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన 'శైవం' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాం. ఉషాకిరణ్ మూవీస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట తప్పని రాజుగారు, ఆయన దారిలో నడిచే మనవరాలు, వీరిద్దరి అనుబంధాలతో దాగుడుమూతలాడిన ఓ కోడిపుంజు, వీరికి తోడు తమ సయ్యాటలతో అందరి మధ్య సమస్యలను సృష్టించిన ఒక యువ జంట కథ ఈ చిత్రం. ఈ సినిమాని చూసిన దిల్ రాజు గారు.. సినిమా బాగా నచ్చడంతో తానే స్వయంగా కొని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు" అని తెలిపారు.
దిల్ రాజు మాట్లాడుతూ "ఇదొక అచ్చమైన తెలుగు సినిమా. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. హిలారియస్ ఎంటర్ టైనింగ్ సినిమా ఇది. ఈ సినిమాలో నటించిన రాజేంద్రప్రసాద్, సారా, వినయ్ ల పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మే 7న ప్రీమియర్ షో వేయనున్నాం" అని చెప్పారు.
రాధాకృష్ణ మలినేని మాట్లాడుతూ "క్రిష్, రామోజీరావు, దిల్ రాజు వంటి వారు ఇన్వాల్వ్ అయిన చిత్రంతో దర్శకుడిగా పరిచయమవ్వడం సంతోషంగా ఉంది. ఇదొక ఫ్యామిలి కథ. సినిమా చూసిన తరువాత ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. అందరినీ నవ్వించే ఓ నేటివిటీ ఉన్న సినిమా ఇది. టెక్నీషియన్స్ అంత ఎంతగానో సపోర్ట్ చేసారు." అని చెప్పారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "ఈ సినిమాకి మాతృక తమిళంలో విజయం సాధించిన 'శైవం' సినిమా. ఒరిజినల్ సినిమా కన్నా ఈ చిత్రం బాగా వచ్చింది. దానికి కారణం రాధాకృష్ణ గారు. అధ్బుతమైన కుటుంబ కథా చిత్రానికి కామెడీ జోడించి తీసారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయడం ఆనందంగా ఉంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే సినిమా అవుతుంది. 'దాగుడుమూత దండాకోర్' సినిమా నా జీవితంలో ఒక అధ్బుతమైన అనుభవం" అని తెలిపారు.
ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, సినిమాటోగ్రాఫర్: వి.ఎస్.జ్ఞాన శేఖర్, మాటలు: పెద్దింటి అశోక్ కుమార్, సంగీతం: ఇ.ఎస్.మూర్తి .
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ