Advertisementt

'వినవయ్యా రామయ్యా' మూవీ టీజర్ లాంచ్..!

Thu 07th May 2015 05:53 AM
vinavayya ramayya movie,naganvesh,kruthika,ram prasad,krishnareddy  'వినవయ్యా రామయ్యా' మూవీ టీజర్ లాంచ్..!
'వినవయ్యా రామయ్యా' మూవీ టీజర్ లాంచ్..!
Advertisement
Ads by CJ

నాగాన్వేష్, కృతిక జంటగా సరస్వతి ఫిల్మ్స్ పతాకంపై జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి నిర్మిస్తున్న సినిమా 'వినవయ్యా రామయ్యా'. ఈ చిత్రం టీజర్ లాంచ్ బుధవారం హైదరాబాద్ లో ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా నల్లమలుపు బుజ్జి చిత్ర బృందానికి తన అభినందనలు తెలిపారు. 

కొడాలి వెంకటేశ్వరావు మాట్లాడుతూ "టైటిల్ బావుంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ సినిమాకు సూట్ అయ్యే టైటిల్. కృష్ణారెడ్డి గారు చాలా రోజులు తరువాత ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వనున్నారు. వారి కుమారుడు నాగాన్వేష్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవ్వడం సంతోషంగా ఉంది. అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు. సినిమా మంచి సక్సెస్ ను సాధించి ప్రొడ్యూసర్ కి లాబాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

నాగాన్వేష్ మాట్లాడుతూ "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రంలో బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను. అప్పటి నుండి హీరో అవ్వాలనే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. రామ్ ప్రసాద్ గారు సినిమాను అధ్బుతంగా తెరకెక్కించారు. సినిమాకి పెద్ద ఎసెట్ రసూల్ ఎల్లోర్ గారు అందించిన ఫోటోగ్రఫీ. ప్రతి సన్నివేశంలో ఆయన నాకు చాలా హెల్ప్ చేసారు. అనూప్ మంచి మ్యూజిక్ అందించారు. 'గోల గోల' సాంగ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది" అని చెప్పారు.

రామ్ ప్రసాద్ మాట్లాడుతూ "ఇదొక కుటుంబ కథా చిత్రం. సినిమాకి కొత్త హీరో అయిన కథ మీదే ఎక్కువ ఫోకస్ చేసి కథే హీరోగా నడిపించాం. నాగాన్వేష్ కూడా కొత్త హీరో అని ఫీల్ అవకుండా ప్రతి సీన్ లో బెటర్ మెంట్ చూపిస్తూ నటించాడు. అనూప్ మంచి పాటలు ఇచ్చారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమాతో రసూల్ కి ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది. దృశ్యం ఫేం కృతిక ఈ సినిమాలో హీరోయిన్ గా బాగా నటించింది." అని అన్నారు. 

కృష్ణారెడ్డి మాట్లాడుతూ "ఈ సంవత్సరంలో బెస్ట్ హిట్స్ లో ఒక చిత్రంగా 'వినవయ్యా రామయ్యా' నిలుస్తుంది. క్లైమాక్స్ అధ్బుతంగా ఉంటుంది. బ్రహ్మానందం గారు క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకున్నారు" అని చెప్పారు.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, నరేష్, రామరాజు, సప్తగిరి, షకలక శంకర్, తులసి, రమాప్రభ, జయవాణి, ఉషాశ్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్: రసూల్ ఎల్లోర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: ఎమ్.కిరణ్ కుమార్, మాటలు: వీరబాబు బాసిన, అనిల్ మల్లెల, నిర్మాత: 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి, దర్శకత్వం: జి.రామ్ ప్రసాద్ 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ