తమిళ, తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసిన జ్యోతిక సూర్యతో పెళ్ళయిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తెరమీదకు రాబోతోంది జ్యోతిక. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో సూర్య నిర్మించిన ‘36 వయదినిలే’ చిత్రంలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించింది. ప్రముఖ నటుడు రెహమాన్ సరసన జ్యోతిక నటించింది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 15న రిలీజ్ కాబోతోంది. మలయాళంలో సూపర్‌హిట్ అయిన ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ చిత్రానికి రీమేక్‌గా ‘36 వయదినిలే’ చిత్రాన్ని రూపొందించారు. ఇంకా ఈ చిత్రంలో అభిరామి, నాజర్, ఢల్లీి గణేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి స్పందన వస్తోందట. మలయాళ వెర్షన్‌కి కూడా రోషన్ ఆండ్రూసే దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ద్వారా జ్యోతిక మళ్ళీ లైమ్‌లైట్‌లోకి వస్తోందని, అది తనకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయమని ఈరోజు జరిగిన ‘రాక్షసుడు’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో సూర్య చెప్పాడు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.