Advertisementt

'మంత్ర 2' మూవీ ఆడియో ఆవిష్కరణ..!

Sat 09th May 2015 04:51 AM
mantra 2,charmi,chethan,sunil kasyap,sathish  'మంత్ర 2' మూవీ ఆడియో ఆవిష్కరణ..!
'మంత్ర 2' మూవీ ఆడియో ఆవిష్కరణ..!
Advertisement
Ads by CJ

చార్మి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ నాయుడు చామకుర్తి సమర్పణలో గ్రీన్ మూవీస్ బ్యానర్ పతాకంపై ఎస్.వి.సతీష్ దర్శకత్వంలో శౌరి రెడ్డి, యాదగిరి రెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా 'మంత్ర2'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన టి.ప్రసన్నకుమార్ బిగ్‌ సీడీని ఆవిష్కరించారు. చార్మి తల్లి సుర్జీత్ కౌర్ ఆడియో సిడీలను విడుదల చేసారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ ఆడియో శ్రేయాస్ మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ "ఈ మధ్యకాలంలో సిరీస్ తో వస్తున్న సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. చార్మి నటించిన మంత్ర సినిమా కన్నా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అధ్బుతంగా ఉంది" అని అన్నారు.

చార్మి మాట్లాడుతూ "నేను నటించిన మంత్ర సినిమా నా కెరీర్ లోనే బెస్ట్ మూవీ గా నిలిచింది. నంది అవార్డ్ కూడా సంపాదించిపెట్టింది. ఆ సినిమా తరువాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కొన్ని హిట్స్ వచ్చాయి. కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. 'మంత్ర 2' సినిమా చేయమని చాలా మంది నన్ను సంప్రదించారు. మంత్ర హిట్ తరువాత దాని సిరీస్ గా సినిమా చేయాలంటే బాధ్యత గా ఫీల్ అయ్యాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ స్టొరీ చెప్పగానే నాకు నచ్చింది. కాని ఖచ్చితంగా హిట్ ఇస్తామనే బాధ్యత తీసుకుంటేనే చేస్తానని చెప్పాను. దానికి వాళ్ళు అంగీకరించి నాతో ఈ చిత్రాన్ని చేయించారు. ఈ సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా వారికే చెందుతుంది. ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ చేసాం. సునీల్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాపై అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం" అని చెప్పారు.

సునీల్ కశ్యప్ మాట్లాడుతూ "చార్మి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

డైరెక్టర్ ఎస్.వి. సతీష్ మాట్లాడుతూ "ఈ సినిమా స్టొరీ చెప్పగానే ఛార్మి గారికి నచ్చింది. మంత్ర సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక ఈ సినిమా చేయడానికి కొంచెం భయపడ్డాను. రాజేంద్ర గారు సినిమాను అధ్బుతంగా విజువలైజ్ చేసారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని చెప్పారు.

నిర్మాత యాదగిరి రెడ్డి మాట్లాడుతూ "సతీష్ అధ్బుతంగా చిత్రీకరించారు. ఈ సంవత్సరం హిట్ సినిమాలలో ఈ చిత్రం కూడా నిలుస్తుంది" అని చెప్పారు.

భాస్కర్ భట్ల మాట్లాడుతూ "చార్మి గారు హిట్ కొట్టడానికి సినిమాలు 'క్యూ' లో ఉన్నాయి. సునీల్ మంచి మ్యూజిక్ అందించాడు. ఖచ్చితంగా సినిమా మంచి హిట్ అవుతుంది" అని చెప్పారు.

హీరో చేతన్ మాట్లాడుతూ "తెలుగులో నేను చేస్తున్న మొదటి సినిమా ఇది. ప్రతి హారర్ సినిమాలో ఓ ట్విస్ట్ ఉంటుంది. ఈ సినిమాలో చార్మి గారే పెద్ద ట్విస్ట్" అని చెప్పారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రిలయన్స్ సౌత్ రీజనల్ మేనేజర్ సంజయ్, శివకుమార్ కలిసి ట్రైలర్ లాంచ్ చేసారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ "ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తరువాత రెండు రాష్ట్రాలలోని విడుదల చేయాలనుకుంటున్నాను. మంత్ర సినిమాలానే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది" అని చెప్పారు.

ఈ చిత్రానికి డైలాగ్స్: మోహన్ చందా, డాన్స్ : ప్రేమ రక్షిత్, ఎడిటర్: బాబు సిద్ధం శెట్టి, సినిమాటోగ్రఫీ: తనికెళ్ళ రాజేంద్ర, కో ప్రొడ్యూసర్స్: బోనాల శ్రీకాంత్, రవితేజ, కె.సురేష్, నిర్మాతలు: పి. శౌరిరెడ్డి, వి.యాదగిరి రెడ్డి, దర్శకత్వం: ఎస్.వి.సతీష్. 

 

 

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ