అవార్డు విన్నింగ్ డైరక్టర్ ప్రవీణ్ సత్తారు. ఆయన తీసిన `చందమామ కథలు`కి ఇటీవలే జాతీయ అవార్డు లభించింది. అంతకుముందు తీసిన 'ఎల్బీడబ్ల్యూ', `రొటీన్ లవ్‌స్టోరీ` చిత్రాలకి కూడా విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఆయన మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈసారి గుంటూరు మురికివాడల నేపథ్యంలో `గుంటూరు టాకీస్` పేరుతో సినిమా చేయబోతున్నారు.
ఇందులో `ఎల్బీడబ్ల్యూ` ఫేమ్ సిద్ధు కథానాయకుడిగా నటించబోతున్నారు. మధుశాలిని కథానాయికగా నటించబోతోంది. కామెడీ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శ్రద్ధాదాస్, మహేష్ మంజ్రేకర్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.