నాగచైతన్య సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఎలాంటి హడావుడి లేకుండా గౌతమ్ సినిమాని ఒప్పుకోవడం, ఆ సినిమాకోసం వెంటనే రంగంలోకి దిగడం చూసి టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఆ చిత్రం `ఏమాయ చేసావె` తరహాలోనే తెరకెక్కబోతున్నట్టు సమాచారం. `ఏమాయ చేసావె` సినిమాని తెలుగులో నాగచైతన్య, సమంతతోనూ... తమిళంలో శింబు, త్రిషతోనూ ఒకేసారి తెరకెక్కించి విజయాన్ని సొంతం చేసుకొన్నాడు.
ఇప్పుడు కూడా అదే తరహాలో తమిళంలో శింబుతోనూ, తెలుగులో నాగచైతన్యతోనూ ఒకే కథను తెరకెక్కిస్తున్నాడట గౌతమ్‌మీనన్. ఈ సినిమాని ఆయన కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేస్తాడట. నాగచైతన్య అందుకే ఒప్పుకొన్నాడట. ఎందుకంటే జులైలోనే చందు మొండేటి దర్శకత్వం వహించనున్న సినిమా మొదలవబోతోంది. అంతలోపు గౌతమ్ సినిమాని పూర్తి చేసుకొస్తాడన్నమాట.