Advertisementt

'లంగా ఓణి'తో సినిమా..!

Mon 11th May 2015 07:11 AM
vamsi krishna,surya,mamatha rahul,langavoni movie  'లంగా ఓణి'తో సినిమా..!
'లంగా ఓణి'తో సినిమా..!
Advertisement
Ads by CJ

వంశీకృష్ణ, సూర్య, ఆర్యారావు, మమతారాహుల్‌ హీరో హీరోయిన్లుగా..నాగరాజు తలారి దర్శకత్వంలో మన్విన్‌ మల్హొత్ర నిర్మిస్తోన్న విలేజ్‌ బ్య్రాక్‌డ్రాప్‌ పెయిన్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ‘‘లంగా ఓణి’. ఈ చిత్రం మే 11న హైద్రాబాద్‌లో ప్రారంభమై రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మన్విన్‌ మల్హొత్ర మాట్లాడుతూ.. ‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీ ఇది. ఈ చిత్రంలో ఐదు పాటలు, ఐదు ఫైట్స్‌ ఉంటాయి. సాంగ్స్‌ రికార్డింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడే ‘లంగాఓణి’ అనే టైటిల్‌ ఈ కథకు కరెక్ట్‌గా యాఫ్ట్‌. ఈ రోజు(మే 11) ప్రారంభమైన ఈ చిత్రం ఈ నెల 24 వరకు హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది. సెకండ్‌ షెడ్యూల్‌ యానం మరియు బెంగుళూర్‌ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం..’ అని అన్నారు. 

చిత్ర దర్శకుడు నాగరాజు తలారి మాట్లాడుతూ..‘‘గతంలో ‘ప్రేమలో ఎబిసి’ చిత్రాన్ని తెరకెక్కించాను. ప్రజంట్‌ సిట్యువేషన్‌లో తెలుగుదనం కనుమరుగవుతున్న నేపథ్యంలో, కట్టు, బొట్టుతో తెలుగుదనం నిండి ఉండే పాత్రలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కంప్లీట్‌ పల్లెటూరి నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుంది. రంగనాధ్‌గారు, మగధీర ఫేం సూర్య, తాగుబోతు రమేష్‌, అప్పారావు తదితరుల నటన ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. కరుణాకర్‌ అందించే సంగీతం ఈ చిత్రానికి ఆదనపు ఆకర్షణ. అన్ని కమర్షియల్‌ హంగులతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..’’ అని అన్నారు. 

ఈ చిత్రానికి ఆర్ట్‌: కె. నాగేంద్రబాబు, మేకప్‌: గోపి, జి. అజిత్‌,  కాస్ట్యూమ్‌: జగదీష్‌, లిరిక్స్‌: చిర్రావూరి, భారతీబాబు, శ్రీకాంత్‌, సింగర్స్‌: గీతామాధురి, శ్రీకాంత్‌, శ్రీకృష్ణ, దీపు, గాయత్రి, కెమెరా: బైపల్లి రవికుమార్‌, సంగీతం: కరుణాకర్‌ సి.హెచ్‌, మేనేజర్‌: ముజీబ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆర్‌కె, నిర్మాత: మన్విన్‌ మల్హొత్ర, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: నాగరాజు తలారి.​

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ