Advertisementt

మకరజ్యోతి క్రియేషన్స్ మూవీ విశేషాలు..!

Thu 14th May 2015 02:29 PM
makarajyothi creations,kalyan chakravarthi,naga sri charan,kabir rafi  మకరజ్యోతి క్రియేషన్స్ మూవీ విశేషాలు..!
మకరజ్యోతి క్రియేషన్స్ మూవీ విశేషాలు..!
Advertisement
Ads by CJ

నాగ శ్రీ చరణ్ కథానాయకుడిగా, జి.ఎన్.రావు సమర్పణలో కళ్యాన్ చక్రవర్తి దర్శకత్వంలో కళ్యాన్ బుజ్జి నిర్మాతగా  'మకరజ్యోతి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్1' చిత్రం విశేషాలు తెలిపేందుకు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాన్ చక్రవర్తి మాట్లాడుతూ "ఇదొక రొమాంటిక్, హారర్ మూవీ. జూన్ రెండవ వారంలో చిత్రం ప్రారంభోత్సవ వేడుక జరిపి జూలై మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలుపెట్టనున్నాం. 12 నుండి 15 రోజులలో షూటింగ్ ముగించుకొని సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అని చెప్పారు.

నాగ శ్రీ చరణ్ మాట్లాడుతూ "డైరెక్టర్ స్టొరీ చెప్పగానే నాకు నచ్చి సినిమా చేయడానికి అంగీకరించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ కబీర్ రఫీ మాట్లాడుతూ "సుమారుగా 30 నుండి 40 షార్ట్ ఫిల్మ్స్ కి నేను వర్క్ చేసాను. నా పని నచ్చి ఈ సినిమాకి మ్యూజిక్ అందించే అవకాశం ఇచ్చారు. స్టొరీ లైన్ బావుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న సినిమా ఇది" అని చెప్పారు.

మధుకర్ మాట్లాడుతూ "కామెడీ, సస్పెన్స్ తో పాటు ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ కలిగించే అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. చిత్ర బృందానికి నా ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.

బేబీ యోదా మాట్లాడుతూ "ఈ సినిమాలో నాకొక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి నా ధన్యవాదాలు" అని చెప్పారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ