Advertisementt

'అసుర' మూవీ ఆడియో రిలీజ్..!

Thu 14th May 2015 09:36 PM
asura movie audio release,nara rohit,krishna vijay,sai karthik music  'అసుర' మూవీ ఆడియో రిలీజ్..!
'అసుర' మూవీ ఆడియో రిలీజ్..!
Advertisement
Ads by CJ

నారా రోహిత్, ప్రియా బెనర్జీ జంటగా నారా రోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్, కుషాల్ మీడియా, ఆరన్ మీడియా వర్క్స్ పతాకాలపై కృష్ణ విజయ్ దర్శకత్వంలో శ్యామ్ దేవా భక్తుని, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'అసుర'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లోని పార్క్ హయాత్ లో పలువురు సినీ, రాజకీయ నాయకుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ పత్తిపాటి పుల్లారావు బిగ్‌ సీడీని ఆవిష్కరించి తొలి సిడిను హీరో నారా రోహిత్ కు అందించారు. సాయికార్తిక్ సంగీతం అందించిన ఈ ఆడియో లహరి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ చిత్రం ట్రైలర్ ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు లాంచ్ చేసారు. ఈ సందర్భంగా 

పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ "నారా రోహిత్ 'అసుర'తో సినీ ప్రపంచంలో ప్రభంజనం సృష్టించాలి. మంచి మాస్ హీరోగా ఎదగాలి. యువతకు 'అసుర' మంచి సినిమా అవుతుంది. నారా రోహిత్ స్వయంగా  సమర్పిస్తున్న తొలి సినిమా ఇది. చాలా కాన్ఫిడెంట్ తో తీసారు. టీమ్ అందరికి నా అభినందనలు" అని చెప్పారు.

దర్శకుడు కృష్ణవిజయ్ మాట్లాడుతూ "సినిమా ఐదు పాటలున్నాయి. లిరిసిస్ట్స్ అందరు మంచి సాహిత్యాన్ని అందించారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు, ప్రొడక్షన్ టీమ్ కు నా కృతజ్ఞతలు" అని చెప్పారు.

నిర్మాత శ్యామ్ దేవా భక్తుని మాట్లాడుతూ "ఈ సినిమాలో నారా రోహిత్ డబుల్ ఎనర్జీతో వర్క్ చేసాడు. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు ఎంతగానో సహకరించారు. కృష్ణ విజయ్ నేను కలిసి ఓ సినిమా తీయాలనుకున్నాం. 'అసుర'తో మా కోరిక నెరవేరింది" అని చెప్పారు.

నారా రోహిత్ మాట్లాడుతూ "అసుర లాంటి డిఫరెంట్ కమర్షియల్ సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ విజయ్ కు నా ధన్యవాదాలు. అలానే ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు సాయికార్తిక్ కు స్పెషల్ థాంక్స్. అందరు చాలా కష్టపడి సినిమా చేసారు" అని చెప్పారు.  

మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ మాట్లాడుతూ "సినిమాలో పాటలు రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉండడానికి ప్రయత్నించాం. ఎక్స్ పెరిమెంటల్ మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్స్ కి నా ధన్యవాదాలు" అని చెప్పారు. 

కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ "అసుర చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. సినిమా మంచి హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ "రోహిత్ నాన్నగారు నాకు ఆప్తమిత్రుడు. ఈ సినిమా మంచి సక్సెస్ ను సాదించి రోహిత్ కు, చిత్రబృందానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా" అని తెలిపారు.

దర్శకుడు పరశురాం మాట్లాడుతూ "నా కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ సోలో. సినిమాను చిత్రీకరించడంలో డైరెక్టర్ కు స్వేచ్చనిచ్చే హీరో నారా రోహిత్. ఆయనతో మరో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా డైరెక్టర్ కు, ప్రొడ్యూసర్ కు నా అభినందనలు" అని చెప్పారు.

డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ "కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో నారా రోహిత్ ముందుంటారు. ఈ సినిమాలో సాయి కార్తిక్ మ్యూజిక్ అధ్బుతంగా ఉంది. వశిష్ట మంచి లిరిక్స్ అందించారు" అని చెప్పారు.

టి.డి.పి. చైర్మెన్ ఎల్.ఎస్.ఆర్.కె ప్రసాద్ మాట్లాడుతూ "సాంగ్స్ అన్ని బావున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కి, వారి టీమ్ కు నా అభినందనలు. నారా రోహిత్ తన నటనతో నంది అవార్డు సొంతం చేసుకున్నారు. హీరోగానే కాకుండా సమాజసేవ కూడా చేస్తున్నారు. యూత్ అందరికి రాకింగ్ మూవీ అవుతుంది. ఆర్థికంగా ఈ చిత్రం ఘనవిజయం సాదించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

హీరో రాహుల్ మాట్లాడుతూ "సాయి కార్తిక్ మ్యూజిక్ బావుంది. ఈ సినిమా డైరెక్టర్ విజయ్ నాకు మూడు సంవత్సరాలుగా తెలుసు. మంచి టేస్ట్, సెన్సిబిలిటీస్ ఉన్న వ్యక్తి. 'అసుర' ఫస్ట్ లుక్, పోస్టర్స్ నాకు చాలా నచ్చాయి. రోహిత్ మూవీస్ అన్ని సెన్సిబుల్ గా ఉంటాయి"అని చెప్పారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ "విజయ్ తో నాకు మంచి బాండ్ ఉంది. రోహిత్ సినిమాతో విజయ్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో 'అసురసుర' సాంగ్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా పోస్టర్స్,ట్రైలర్స్ చూస్తుంటేనే తెలుస్తుంది సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని" అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ శేషాద్రి నాయుడు, లహరి శ్రీనివాస్ పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి రచన-దర్సకత్వం: కృష్ణ విజయ్, నిర్మాతలు: శ్యామ్ దేవా భక్తుని, కృష్ణ విజయ్, సంగీతం: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ఆర్ట్: మురళి కొండేటి, డాన్స్:  విజయ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ