Advertisementt

ఇక్కడ 10 లక్షలు వచ్చాయి ఓకే.. మరి అక్కడ.!

Sat 16th May 2015 11:24 PM
telugu movie kick2,hero raviteja,rakul preeth singh,nandamuri kalyan ram,director surender reddy,kick2 trailer  ఇక్కడ 10 లక్షలు వచ్చాయి ఓకే.. మరి అక్కడ.!
ఇక్కడ 10 లక్షలు వచ్చాయి ఓకే.. మరి అక్కడ.!
Advertisement
Ads by CJ

రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో ‘కిక్‌’ వంటి సూపర్‌హిట్‌ తర్వాత వస్తున్న ‘కిక్‌2’ మీద ఆడియన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేటర్‌ ట్రైలర్‌కి యూ ట్యూబ్‌లో 10 లక్షల క్లిక్స్‌ రావడమే దీనికి నిదర్శనం.  ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా ‘కిక్‌’ చిత్రాన్ని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేశారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘కిక్‌2’ దాన్ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో వుంటుందని ఎక్స్‌పెక్ట్‌ చెయ్యడంలో తప్పులేదు. అయితే ఈమధ్య కొన్ని సినిమాలపై ప్రేక్షకుల్లో పెరుగుతున్న భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఆయా సినిమాలు రీచ్‌ అవ్వలేకపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. యూ ట్యూబ్‌లో ‘కిక్‌2’ ట్రైలర్‌కి 10 లక్షల క్లిక్స్‌ సాధించారు ఓకే. మరి థియేటర్స్‌కి ఎన్ని లక్షల మందిని రప్పించే స్టఫ్‌ సినిమాలో వుందనేది ఇంపార్టెంట్‌. అయితే ఈ విషయంలో దర్శకనిర్మాతలు, హీరో చాలా కాన్ఫిడెంట్‌గా వున్నట్టు వారి మాటల్ని బట్టి అర్థమవుతోంది. 

ఎన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌ బేనర్‌లో కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన మొదటి సినిమా దర్శకుడు సురేందర్‌రెడ్డి. అలాగే ‘కిక్‌’ తర్వాత రవితేజ, సురేందర్‌రెడ్డి కలిసి చేస్తున్న సినిమా ‘కిక్‌2’. ఈ రెండు సెంటిమెంట్స్‌ వర్కవుట్‌ అయి సినిమాకి హైప్‌ వచ్చింది. అయితే ‘కిక్‌’ చిత్రం ద్వారా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయమైన థమన్‌ ‘కిక్‌2’కి అనుకున్న స్థాయిలో మ్యూజిక్‌ చేయలేకపోయినా సినిమా మీద వున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ మాత్రం తగ్గలేదనేది ట్రైలర్‌కి వచ్చిన క్లిక్స్‌ని చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌ సన్నాహాలు చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ