ఛార్మి ప్రధాన పాత్రలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్, శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకాలపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘జ్యోతిలక్ష్మీ’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా సి.కళ్యాన్ మాట్లాడుతూ "పూరి గారితో ఏడు సంవత్సారాల క్రితమే సినిమా చేయాలనుకున్నాను కాని ఇప్పటికి కుదిరింది. ఈ సినిమా ఆయన నాకు ఇచ్చిన మంచి గిఫ్ట్. 'జ్యోతిలక్ష్మి' ఓ యూత్ ఫుల్, ఎమోషనల్, రొమాంటిక్ తో కూడిన డ్రామా. ఈరోజు చార్మి పుట్టినరోజు సందర్భంగా టీజర్ లాంచ్ చేసాం. ఇప్పటివరకు ఛార్మిని రొమాంటిక్ మరియు ఎంటర్ టైన్ చేసే కోణంలోనే చూసారు. ఈ సినిమాతో ఓ డిఫరెంట్ షేడ్ లో ఛార్మి ను చూడబోతున్నారు. టెక్నీషియన్స్ అందరు ఎంతగానో సహకరించారు. రెవెన్యూ పరంగా కూడా సినిమా హిట్ అవుతుంది. ఈ నెలాఖరున ఆడియో విడుదల చేయనున్నాం. జూన్ మొదటి లేదా రెండవ వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అని తెలిపారు.
సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ "సినిమాలో చార్మి గారు అధ్బుతంగా పెర్ఫార్మ్ చేసారు. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాలో నేను నటించడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.
చార్మి మాట్లాడుతూ "ఈ సినిమా కోసం అందరు చాలా హార్డ్ వర్క్ చేసారు. టీజర్ కు అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది" అని అన్నారు.
పూరిజగన్నాథ్ మాట్లాడుతూ "జ్యోతిలక్ష్మి నాకు బాగా ఇష్టమైన కథ. సినిమాలో చార్మి అధ్బుతంగా నటించింది. కళ్యాన్ గారితో మొదటిసారిగా ఈ సినిమాకి వర్క్ చేసాను. అందరూ ఎంతో ఇష్టంగా చేసిన సినిమా ఇది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పని జరుగుతుంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అని చెప్పారు.
ఛార్మి కౌర్, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.