Advertisementt

అంగ్రేజ్ -2 సక్సెస్ మీట్..!

Mon 18th May 2015 12:01 PM
angrez 2,the angrez 2,maroju sridhar rao,kuntaa nikkil,zeq mccoy  అంగ్రేజ్ -2 సక్సెస్ మీట్..!
అంగ్రేజ్ -2 సక్సెస్ మీట్..!
Advertisement
Ads by CJ

డెక్కన్ సినిమాగా సూపర్ డూపర్ హిట్ అయిన అంగ్రేజ్ సినిమా కు సీక్వెల్ గా వచ్చిన అంగ్రేజ్ -2 సినిమా సూపర్ హిట్ కావడం సంతోషంగా ఉందని సినిమా నిర్మాత శ్రీధర్ రావు అన్నారు. సోమవారం ఫిలిం చాంబర్ లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో నటీనటులు మాట్లాడారు. ఇటీవల విడుదలైన అంగ్రేజ్ 2 సినిమా అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని అన్నారు. ఈ సినిమా చూసి టికెట్ తో సెల్ఫి ఫోటో తీసి పేస్ బుక్ లో పెడితే అంగ్రెక్ష్ 2 నటీనటులను కలిసే అవకాశం కల్పిస్తామని అన్నారు.

గతంలో ఎ ఫిలిం బై అరవింద్, అంగ్రేజ్ తీసిన తాను ఇప్పుడు అంగ్రేజ్ 2 తో మరిన్ని సినిమాలు తీయడానికి స్ఫూర్తి నిచ్చిందని చెప్పారు. దుబాయ్ లాంటి దేశాల్లో అంగ్రేజ్ 2 సినిమాను ఆదరిస్తున్నారని అన్నారు. త్వరలోనే సినిమా పేరుతో అధికారిక యూట్యుబ్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు. నటుడు  ఇస్మాయిల్ మాట్లాడుతూ అంగ్రేజ్ సినిమా తరువాత తనకు ముఫ్ఫై తెలుగు సినిమాల్లో నటించే చాన్స్ వచ్చిందని చెప్పారు. ఈ సినిమా సక్సెస్ కావడం సంతోషంగా ఉందన్నారు. మరో నటుడు సలీం ఫేకు మాట్లాడుతూ డెక్కన్ సినిమాలు అంటే నాచురల్ కామెడికి పెట్టిన పేరు అని చెప్పారు. అంగ్రేజ్ సినిమా తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని అన్నారు. ఇటీవల సూర్య వర్సెస్ సూర్య లో కూడా మంచి పాత్ర పోషించానని చెప్పారు. దర్శకుడు నిఖిల్ కుంట మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ కావడం సంతోషంగా ఉందని చెప్పారు. సంగీత దర్శకుడు మల్లినాథ్ బిర్యాని పాటను రీమిక్స్ చేశామని చెప్పారు. వీకెండ్ పార్టీల్లో ఈసినిమా పాటలు పెట్టుకున్తున్నారని అన్నారు. మరో కీలక పాత్ర పోషించిన నటుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు వచ్చిందని అన్నారు. తెలుగులో పలు సినిమాల్లో నటిస్తున్న్నానని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ