శ్రీహరి ఉదయగిరి హీరోగా భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై వి.ఎస్.వాసు దర్శకత్వంలో దాసరి భాస్కరయాదవ్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘టోల్‌ఫ్రీ నెంబర్ 143’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 28న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీహరి ఉదయగిరి, నటి ఇషిక, నిర్మాత దాసరి భాస్కరయాదవ్, దర్శకుడు వి.ఎస్.వాసు, సంగీత దర్శకుడు శ్రీవెంకట్, మాటల రచయిత మహేష్ ఎల్., సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ సబ్బి, ప్రొడక్షన్ డిజైనర్ బన్సి కె. తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దాసరి భాస్కరయాదవ్ మాట్లాడుతూ ‘‘ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ చిత్రంలో ఒక మంచి సందేశంతోపాటు, మంచి కామెడీ కూడా వుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా చాలా క్లీన్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. మే 28న మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మా డైరెక్టర్ వాసుగారు ఏదైతే చెప్పారో దాన్ని యథాతధంగా స్క్రీన్ మీద చూపించారు. ఔట్‌పుట్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు.
దర్శకుడు వి.ఎస్.వాసు మాట్లాడుతూ ‘‘నేను చెప్పదలుచుకున్న విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ తియ్యగలిగానన్న శాటిస్‌ఫ్యాక్షన్ నాకు వుంది. ప్రస్తుతం యూత్ ఎలా వుంది అనే అంశాన్ని తీసుకొని ఈ సినిమా చెయ్యడం జరిగింది. పిల్లలు కాలేజ్‌కి వెళ్తున్నారా, సినిమాలకు వెళ్తున్నారా లేక ఏదైనా ప్రేమ వ్యవహారం నడుపుతున్నారా అని తల్లిదండ్రులు చూడడం లేదు. దాని వల్ల ఫేక్ లవ్‌లో పడిపోయిన యూత్ తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి మంచి సబ్జెక్ట్ చెప్పగానే మా నిర్మాత భాస్కరయాదవ్‌గారు సినిమా చెయ్యడానికి ముందుకొచ్చి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి కంప్లీట్ చేసి రిలీజ్ వరకు తెచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేసే విధంగా వుంటుంది. మే 28న రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.
హీరో శ్రీహరి ఉదయగిరి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విషయంలో అందరం చాలా హ్యాపీగా వున్నాం. ఇప్పుడు మేం ఎంత హ్యాపీగా వున్నామో సినిమా చూసి ఆడియన్స్ కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో గబ్బర్‌సింగ్ గ్యాంగ్ చేసే కామెడీ, రెయిన్ ఫైట్ హైలైట్ అవుతాయి’’ అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీవెంకట్ మాట్లాడుతూ ‘‘ఫేక్ లవ్‌కి, రియల్ లవ్‌కి డిఫరెన్స్ చూపిస్తూ మంచి సందేశం, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేసి రూపొందించిన సినిమా ఇది. ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ చేసే అవకాశం నాకు కలిగింది. మేమంతా ఎంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.
ఇషిక మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో ఒక మంచి పాట చేశాను. ఈ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఇది పైసా వసూల్ మూవీ. ఇది అందరికి సంబంధించిన కథ. తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా’’ అన్నారు.
మాటల రచయిత మహేష్ మాట్లాడుతూ ‘‘జనరల్‌గా యూత్ సినిమా అంటే బూతు వుంటుందని చాలా మంది అభిప్రాయం. అయితే ఈ సినిమాలో అలాంటివి ఏమీ లేకుండా చాలా క్లీన్‌గా కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగిన సినిమాగా వి.ఎస్.వాసుగారు రూపొందించారు. మా చిత్రాన్ని అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
శ్రీహరి ఉదయగిరి, హేమంతిని, రోషిక, ఇషిక, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, సుమన్‌శెట్టి, ధన్‌రాజ్, రఘు, చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీవెంకట్, సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ సబ్బి, ఎడిటింగ్: సత్య గిడుతూరి, మాటలు: మహేష్ ఎల్., ప్రొడక్షన్ డిజైనర్: బన్సి కె., నిర్మాత: దాసరి భాస్కర యాదవ్, దర్శకత్వం: వి.ఎస్.వాసు.