Advertisementt

ఎన్టీఆర్‌ బర్త్‌డే స్పెషల్‌ అభయ్‌రామ్‌.!

Tue 19th May 2015 03:17 PM
jr ntr,young tiger ntr,ntr son abhay ram,jr. ntr birthday on 20th may  ఎన్టీఆర్‌ బర్త్‌డే స్పెషల్‌ అభయ్‌రామ్‌.!
ఎన్టీఆర్‌ బర్త్‌డే స్పెషల్‌ అభయ్‌రామ్‌.!
Advertisement
Ads by CJ

నిన్న మొన్నటి వరకు జూనియర్‌ ఎన్టీఆర్‌గా పిలవబడ్డ ఎన్టీఆర్‌ ఇప్పుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌గా మారాడు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా మరో జూనియర్‌ను ప్రేక్షకులకు, అభిమానులకు పరిచయం చేశాడు. తనయుడు అభయ్‌రామ్‌తో కలిసి వున్న ఫోటోను ఈరోజు మీడియాకు రిలీజ్‌ చేశాడు ఎన్టీఆర్‌. జూలై 22, 2014న జన్మించిన అభయ్‌రామ్‌కి సంబంధించి మీడియాలో ఇప్పటివరకు ఎలాంటి ఫోటో కనిపించలేదు. రేపు(20) తన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆరే స్వయంగా రెండు స్టిల్స్‌ను విడుదల చేశాడు. దీంతో ముద్దులొలికే అభయ్‌రామ్‌ను చూసుకొని మురిసిపోతున్నారు ఎన్టీఆర్‌ అభిమానులు. ఫోటో రిలీజ్‌ అయిందే తడవుగా సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలను పెట్టి ఎవరికి నచ్చిన కామెంట్‌, కాంప్లిమెంట్స్‌ ఇస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. మొత్తానికి నందమూరి వంశం నుంచి మరో వారసుడు మీడియాకు పరిచయమయ్యాడు. ఈ బుడతడు భవిష్యత్తులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి మరి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ