Advertisementt

సూర్య కూడా సాయపడతాడా?

Wed 20th May 2015 06:55 AM
surya,surya helps babubabi promotion,rakshasudu movie,tamil actor surya,  సూర్య కూడా సాయపడతాడా?
సూర్య కూడా సాయపడతాడా?
Advertisement
Ads by CJ
తమిళ కథానాయకుడు సూర్య తెలుగులో మంచి మార్కెట్‌ని సంపాదించుకొన్నాడు. అందుకే ఆయన నటించిన ప్రతీ సినిమా తెలుగులో విడుదలవుతూ మంచి వసూళ్లను రాబట్టుకొంటుంటుంది. సూర్య సినిమాలకి ప్రమోషన్‌ చేసే విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా మంచి సహకారం అందిస్తుంటుంది. నిన్న జరిగిన రాక్షసుడు సినిమా ఆడియో ఫంక్షన్‌కి ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇదివరకటి చిత్రాలకు సంబంధించిన వేడుకలకి కూడా చాలా మంది తెలుగు సినీ ప్రముఖులు హాజరై సూర్యకి సహకారం అందజేశారు. ఇప్పుడు మన ‘బాహుబలి’ తమిళంలోకి వెళుతోంది. మరి అక్కడ తమిళ కథానాయకులు ఎంతవరకు ఏ రేంజ్‌లో ఎంకరేజ్‌ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
ఎవర్నుంచి ఎలాంటి సహకారం వస్తుందో తెలియదు కానీ... సూర్య మాత్రం ‘బాహుబలి’కి పూర్తి స్థాయిలో సాయపడాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. రాజమౌళికీ, సూర్యకీ మంచి అనుబంధముంది. అలాగే సూర్య, ప్రభాస్‌ మంచి స్నేహితులు. అలాంటప్పుడు తప్పకుండా ‘బాహుబలి’కి సూర్య సహకారం అందజేస్తాడు. అంతే కాదు... ‘బాహుబలి’ సినిమాని తమిళంలో  కె.ఇ.జ్జానవేల్‌రాజా కొన్నాడు.  ఆయన సూర్యకి మంచి దోస్త్‌. అందుకే సూర్య నుంచి వందశాతం సపోర్ట్‌ ‘బాహుబలి’కి ఉంటుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ