Advertisementt

ప్రభాస్‌కి జోడీని వెదుకుతున్నారు!

Sat 23rd May 2015 03:49 AM
prabhas,bahubali,prabhas marriage,hero prabhas,bahubali,director sujith,prabhas next movie  ప్రభాస్‌కి జోడీని వెదుకుతున్నారు!
ప్రభాస్‌కి జోడీని వెదుకుతున్నారు!
Advertisement
Ads by CJ
ఆరడుగుల అందగాడు ప్రభాస్‌ కోసం అమ్మాయిల్ని వెదుకుతున్నారు. సినిమాకోసం అర్జంటుగా ఒకమ్మాయి కావాలి, నిజ జీవితంలో తోడు కోసం మరో అమ్మాయి కావాలి. ఆ లెక్కన ఇప్పుడు ప్రభాస్‌కి ఇద్దరమ్మాయిలు కావాలన్నమాట. అందుకే అటు ఫ్యామిలీ మెంబర్స్‌, ఇటు సినిమాకి సంబంధించిన దర్శకనిర్మాతలు బిజీ బిజీగా గడుపుతున్నారు. ‘బాహుబలి’ సినిమా పూర్తయింది కాబట్టి వెంటనే ప్రభాస్‌కి పెళ్లి జరిపించే ఆలోచనలో కుటుంబ సభ్యులున్నారు. ఆ మేరకు తగిన వధువుకోసం అన్వేషణ జరుపుతున్నారు.   అలాగే ‘బాహుబలి’ పూర్తయింది కాబట్టి కొత్త సినిమా కోసం కూడా  సన్నాహాలు మొదలుపెట్టాడు ప్రభాస్‌. ఆ మేరకు సుజిత్‌ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పేశారు. అందులో హీరోయిన్‌ ఎంపిక గురించి చిత్రబృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. బాలీవుడ్‌ భామ అలియాభట్‌ని ఎంపిక చేసుకొనే ఆలోచనలో ఉన్నారట. అయితే హైట్‌ విషయంలో ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఆలోచనలో పడ్డారట. ఆమె కాకుండా మరొకరి కోసం కూడా అన్వేషణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ