చూడ్డానికి అఖిల్ మిల్కీ బాయ్‌లా ఉంటాడు కానీ... మనోడు ముదురు భామలతోనూ అలవోకగా కెమిస్ట్రీ పండిస్తాడు. ఆ విషయం టైటన్ యాడ్‌తోనే ప్రూవ్ అయ్యింది. అందులో పెళ్లి చేసుకొన్న కల్కి కొచ్లిన్ ప్రియుడిగా నటించి అదరగొట్టాడు. అందుకే అఖిల్‌ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అన్నట్టు మనోడు ఇప్పుడు మరో బాలీవుడ్ భామపై మనసుపడ్డాడు. ఆ భామ ఎవరో కాదు... శ్రద్ధాకపూర్. ఇటీవల శ్రద్ధ `ఏబీసీడీ2` అనే చిత్రంలో నటించింది. వరుణ్‌ధావన్‌తో కలిసి ఆమె చేసిన సందడి ట్రయిర్లలోనే యమా ఇదిగా ఆకట్టుకొంటోంది. ట్రయిలర్లో శ్రద్ధా చేసిన డ్యాన్స్ అఖిల్‌కి పిచ్చపిచ్చగా నచ్చేసిందట. అందుకే `అద్భుతం... అమోఘం` అంటూ అఖిల్ కితాబునిచ్చాడు. అంతే కాదు.. ఆమెతో కలిసి డ్యాన్స్ వేయాలనుందని కూడా చెప్పుకొచ్చాడు. మనోడికి శ్రద్ధా అంతగా నచ్చేసిందట. రాబోయే రోజుల్లో ఆమెతో కలిసి కచ్చితంగా నటించే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.