‘బాహుబలి’ చిత్రానికి దేశవ్యాప్తంగా వున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజమౌళి హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. బిజినెస్‌పరంగా మంచి క్రేజ్ వున్న ఈ చిత్రం ఆడియో పరంగా కూడా రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం ఆడియో రైట్స్‌ని లహరి మ్యూజిక్ 2 కోట్ల 25 లక్షలకు తీసుకోవడంతో తెలుగు సినిమా ఆడియో చరిత్రలో ఆడియో రైట్స్ పరంగా కొత్త రికార్డ్ సృష్టించింది ‘బాహుబలి’.
ఈ చిత్రం ట్రైలర్‌ను మే 31న విడుదల చేస్తామని ఎప్పటి నుంచో చెప్తున్న రాజమౌళి దానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌కి సెన్సార్ కూడా పూర్తయింది. రెండు నిముషాల ఈ ట్రైలర్ యు/ఎ సర్టిఫికెట్ పొందింది. మే 31న జరగబోయే ఆడియో ఫంక్షన్లో ఈ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు.
బడ్జెట్‌పరంగా, టెక్నాలజీ పరంగా, ఆడియో రైట్స్ పరంగా సంచలనాలు సృష్టిస్తున్న ‘బాహుబలి’ ఇప్పుడు ఆడియో ఫంక్షన్ విషయంలో కూడా కొత్త రికార్డ్ క్రియేట్ చెయ్యబోతోంది. మే 31న గ్రాండ్‌గా జరగబోయే ఆడియో ఫంక్షన్ కోసం కోటిన్నర రూపాయలను వెచ్చిస్తున్నట్టు సమాచారం. మునుపెన్నడూ జరగని విధంగా ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ చాలా విభిన్నంగా జరపబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న బహు భాషా చిత్రం ‘బాహుబలి’ని జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.