ఆకాష్ పూరి, ఉల్క గుప్తా జంటగా ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజ్ మాదిరాజు దర్శకత్వంలో ఎ.రమేష్‌ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రాపోరి’. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు ముగించుకొని జూన్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ "ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్ నుండి వస్తోన్న ప్రొడక్షన్ 30వ చిత్రం ఆంధ్రాపోరి. జూన్ 5 న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అనేక హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రాజ్ మాదిరాజ్ మంచి స్క్రిప్ట్‌తో ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. తప్పకుండా అందరినీ అలరించే చిత్రమవుతుంది’’ అన్నారు.
రాజ్ మాదిరాజ్ మాట్లాడుతూ "ప్రతి మనిషి జీవితంలో తొలి ప్రేమ అనేది ఉంటుంది. ఆ అనుభవాలు తనను చివరి వరకు వెంటాడుతూనే ఉంటాయి. ఈ సినిమా చూసిన వారికి కొత్త అనుభవం కలుగుతుంది" అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ జోశ్యభట్ల మాట్లాడుతూ "ఈ సినిమాలో 5 పాటలు, 3 బిట్ సాంగ్స్ ఉన్నాయి. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రీరికార్డింగ్ అధ్బుతంగా కుదిరింది. ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
ఆకాష్ పూరి మాట్లాడుతూ "ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రమేష్ ప్రసాద్ గారికి, దర్శకుడు రాజ్ మాదిరాజ్ గారికి థాంక్స్. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు" అని అన్నారు.
రిలయన్స్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ సంజయ్ మాట్లాడుతూ "ఈ బ్యానర్ తో అసోసియేట్ అవ్వడం సంతోషంగా ఉంది. జూన్ 5న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నాం" అని చెప్పారు.
ఆకాష్‌పూరి, ఉల్క గుప్తా, అరవింద్ కృష్ణ, ఈశ్వరిరావు, పూర్ణిమ, ఉత్తేజ్, డా॥ శ్రీకాంత్, అభినయ, శ్రీముఖి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, సంగీతం: డా॥ జోశ్యభట్ల, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, ఆర్ట్: రాజీవ్ నాయర్, డాన్స్: చంద్రకిరణ్, ప్రొడక్షన్ డిజైనర్: మహేష్ చదలవాడ, కోడైరెక్టర్: రమేష్ నారాయణ్, నిర్మాత: ఎ.రమేష్‌ప్రసాద్, దర్శకత్వం: రాజ్ మాదిరాజు.