Advertisementt

పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో 'కేటుగాడు'..!

Sat 30th May 2015 11:14 AM
ketugadu movie,tejas,kittu nalloori,venkatesh balasani  పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో 'కేటుగాడు'..!
పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో 'కేటుగాడు'..!
Advertisement
Ads by CJ

‘ఉలవచారు బిర్యాని’ ద్వారా హీరోగా పరిచయమైన తేజస్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'. నూతన దర్శకుడు కిట్టు నల్లూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో చాందినీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ రచయిత వీఎస్‌పీ తెన్నేటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని '100 క్రోర్స్ అకాడమీ'తో  కలిసి వెంకటేష్ మూవీస్ పతాకంపై యువ వ్యాపారవేత్త వెంకటేష్ బలసాని నిర్మించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను  జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా తాను 'కేటుగాడు' చిత్రాన్ని తెరకెక్కించానని తెలిపారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా, క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందించడంలో తనకు నిర్మాత వెంకటేష్ పూర్తి సహాయ సహకారాలు అందించారని ఆయన ప్రశంసించారు. వచ్చే నెల మొదటివారంలో ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేసి ...నెలాఖరుకు సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ముఖ్య నటీనట వర్గం: సుమన్‌, రాజీవ్‌ కనకాల, అజయ్‌, సప్తగిరి, స్నిగ్ధ, భావన, ప్రవీణ్‌, చంద్రశేఖర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, అదుర్స్‌ రఘు, సత్య తదితరులు  

సాంకేతిక వర్గం: మాటలు: పి.రాజశేఖర్‌రెడ్డి, భాషాశ్రీ, పాటలు: శ్రీమణి,కాసర్ల శ్యామ్‌,భాషాశ్రీ, బాలాజీ బి.సుబ్బరాయశర్మ, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటర్‌: పి.వెంకటేశ్వర్రావు, ఫైట్‌ మాస్టర్‌: నందు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అచ్చిబాబు.యం, సంపత్‌కుమార్‌.ఎ, సమర్పణ: వి.యస్‌.పి.తెన్నేటి, నిర్మాత: వెంకటేష్‌ బలసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టూ నల్లూరి

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ