Advertisementt

'ఆర్.పి.ఎ.క్రియేషన్స్' వారి చిత్రం ప్రారంభం..!

Sun 31st May 2015 09:47 AM
sunil,vamsikrishna akella,sudarsan reddy,rpa creations  'ఆర్.పి.ఎ.క్రియేషన్స్' వారి చిత్రం ప్రారంభం..!
'ఆర్.పి.ఎ.క్రియేషన్స్' వారి చిత్రం ప్రారంభం..!
Advertisement
Ads by CJ

సునీల్ హీరోగా వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మాతగా 'ఆర్.పి.ఎ.క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్2' చిత్రం ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్ లోని రామనాయుడు స్టూడియోస్ లో జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ ను ఇవ్వగా, దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ ఆకెళ్ళ మాట్లాడుతూ "రక్ష సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యాను. సునీల్ గారితో ఎప్పటినుండో సినిమా చేయాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది. ఇదొక యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ సినిమా. సునీల్ గారిని మరో స్థాయికి తీసుకు వెళ్ళే చిత్రమవుతుంది. సినిమా కథ వినగానే ఓకే చేసి చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

సునీల్ మాట్లాడుతూ "దర్శకుడు వంశీ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ఈ సినిమా నాకొక పరీక్ష లాంటిది. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది" అని చెప్పారు.

సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ "ప్రేమకథా చిత్రం సినిమాను నిర్మించిన తరువాత సుమారు 100 కథలను విన్నాను. కాని అవేవి నన్ను సంతృప్తి పరచలేదు. వంశీ ఈ కథ చెప్పగానే నచ్చి ఓకే చేసాను. సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నాం. ఈ సంవత్సరంలోపు సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ దినేష్ మాట్లాడుతూ "ఈ సినిమా ఆరు పాటలు ఉంటాయి. మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది" అని చెప్పారు.

ఈ చిత్రానికి ప్రొడ్యూసర్: ఆర్.సుదర్శన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరాం, మ్యూజిక్: దినేష్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, ఆర్ట్ డైరెక్టర్: రమణ వంక, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ళ.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ