Advertisementt

'చెంబు చిన సత్యం' మూవీ ట్రైలర్ విడుదల..!

Sun 31st May 2015 09:52 AM
chembu china satyam,sunil shetty,pramodini,ravindhra soori,sambasivarao  'చెంబు చిన సత్యం' మూవీ ట్రైలర్ విడుదల..!
'చెంబు చిన సత్యం' మూవీ ట్రైలర్ విడుదల..!
Advertisement
Ads by CJ

సుమన్ షెట్టి, ప్రమోదిని జంటగా మాస్టర్ భువనహర్ష సమర్పణలో ఆలూరి క్రియేషన్స్ పతాకంపై నామాల రవీంద్రసూరి దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న సినిమా 'చెంబు చినసత్యం' ఎల్.ఐ.సి ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ లో దర్శకుడు ఎన్.శంకర్, నిర్మాత మల్కాపురం శివకుమార్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రవీంద్రసూరి మాట్లాడుతూ "ఈ సినిమా కథను నమ్మి ఓ స్టార్ కమెడియన్ మెయిన్ లీడ్ గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సినిమా టైటిల్ క్యాచీగా ఉందని పెట్టాం. ఇదొక హారర్ కామెడీ సినిమా. ఇందులో సుమన్ ఏ కల కన్నా అది నిజమవుతుంది. సుమన్ తో పాటు  తన కుటుంబ సభ్యులంతా అద్దెకు ఓ ఇంట్లో దిగుతారు. ఆ ఇంట్లో ప్రవేశించినప్పటి నుండి ఇంట్లో అందరు చనిపోతుంటారు. సుమన్ వారిని కాపాడుకునే ప్రయత్నంలో సినిమా రన్ అవుతుంటుంది" అని చెప్పారు.

ఎన్.శంకర్ మాట్లాడుతూ "కలకు, కళకు మధ్య ఉన్న తేడాను ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హారర్ జోనర్ లో తీస్తున్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ "టైటిల్ కు తగ్గట్లుగానే సినిమా ఉంటుందని భావిస్తున్నాను. చిత్ర బృందానికి నా అభినందనలు"అని చెప్పారు.

నిర్మాత సాంబశివరావు మాట్లాడుతూ "సమాజంలో ఉన్న సమస్యలను వాటికి పరిష్కారాలను చూపిస్తూ సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. ఈ సినిమా ప్రేక్షాకదరణ పొందుతుందని భావిస్తున్నాను" అని చెప్పారు.

సుమన్ షెట్టి మాట్లాడుతూ "సినిమా బాగా వచ్చింది. టైటిల్ బావుందని అందరు చెప్తున్నారు. కామెడీ ట్రాక్ అందరిని అలరిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు"అని చెప్పారు.

ప్రమోదిని మాట్లాడుతూ "మొదటిసారి లీడ్ రోల్ లో నటిస్తున్నాను. సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కురాకుల మాట్లాడుతూ "సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మంచి టీమ్. అందరం ఎఫర్ట్ పెట్టి పని చేసాం. మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం" అని చెప్పారు.

ఈ చిత్రానికి కెమెరా: తోట వి.రమణ, ఎడిటింగ్: వెంకట్, పాటలు: మౌన శ్రీ మల్లిక్, నిర్మాత: ఆలూరి సాంబశివరావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: నామాల రవీంద్ర సూరి. 

 

 

 

 

 

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ