Advertisementt

ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది-సూర్య..!

Sun 31st May 2015 09:54 AM
rakshasudu,surya,gnanavel raja,venkat prabhu,nayanathara  ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది-సూర్య..!
ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది-సూర్య..!
Advertisement
Ads by CJ

సూర్య, నయనతార, ప్రణీత ప్రధాన పాత్రల్లో జ్ఞానవేల్ రాజా  సమర్పణలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై వెంకట్ 

ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రాక్షసుడు'. ఈ సినిమాను మేధా క్రియేషన్స్ పతాకంపై కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌టాక్‌తో రన్‌ అవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ ‘‘ఈ సినిమాని 500 థియేటర్స్‌లో విడుదల చేసాం. ఈ వీకెండ్‌ వచ్చేసరికి 600 థియేటర్స్‌కి పెంచారంటే సినిమా ఎంత పెద్ద సక్సెస్‌ అయిందో తెలుసుకోవచ్చు. డిఫరెంట్‌ సినిమా చేద్దామని చేసిన ప్రయత్నమే ఈ సినిమా. ఇది ఆత్మలకు సంబంధించిన సినిమా. ఇందులో నేను హీరోగా నటించాననడం కంటే క్యారెక్టర్‌ చేశానని చెప్పవచ్చు. మేథ క్రియేషన్స్‌లో కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డిలు ప్రమోషన్స్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఇది కమర్షియల్‌ మూవీ కాదు ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ. చిన్నపిల్లలకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌’’ అన్నారు. 

దర్శకుడు వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ ‘‘రాక్షసుడు సినిమాని చిన్నపిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేశాం. మేము అనుకున్నట్లుగానే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత ఉండే లైఫ్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌తో ఈ సినిమాని రూపొందించాం. ఇదొక భిన్నమైన ప్రయత్నం. అనుకున్నట్లుగానే సినిమా ఘనవిజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రాక్షసుడు అనే టైటిల్‌ విని ప్రేక్షకులు ఈ సినిమా యాక్షన్‌ సినిమా అనుకున్నారు. కానీ ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ. వెంకట్‌ ప్రభుగారు డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాని రూపొందించారు. కథకు అనుగుణంగా ఏదీ అవసరమో దాన్ని మాత్రమే తెరకెక్కించారు. ఇలాంటి ఒక డిఫరెంట్‌ మూవీని చేసిన సూర్యగారు అభినందనీయులు. ఈ రోజు థియేటర్స్‌ నుండి బయటకు వస్తున్న ప్రేక్షకులు మంచి ఫీల్‌తో బయటకు వస్తున్నారు’’ అన్నారు. 

కన్నన్‌ మాట్లాడుతూ ‘‘ఇది వెంకట్‌ ప్రభుగారి స్టయిల్‌ లో వచ్చిన డిఫరెంట్‌ మూవీ. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న సూర్యగారికి థాంక్స్‌. సినిమాని పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ