Advertisementt

ప్ర‌భాస్ లుక్ మారిందోచ్‌!

Tue 02nd Jun 2015 02:32 AM
prabhas new look,bahubali bollywood trailer launch,rana,tamanna,anushka,rajamouli,prabhas new look   ప్ర‌భాస్ లుక్ మారిందోచ్‌!
ప్ర‌భాస్ లుక్ మారిందోచ్‌!
Advertisement
Ads by CJ
`బాహుబ‌లి`కోసం ప్ర‌భాస్ జుత్తు, గెడ్డం భారీగా పెంచేశారు. గత రెండేళ్లుగా ఆయన అదే లుక్‌తోనే క‌నిపిస్తున్నారు. అయితే కొన్నాళ్ళుగా మ‌ళ్లీ ప్ర‌భాస్‌ని స్టైలిష్ లుక్‌లో చూడాల‌ని ఆయ‌న అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ...  సినిమాలో భ‌ల్లాల దేవ‌గా న‌టించిన రానా త‌న  స్టైల్ని ఛేంజ్ చేసినా... ప్ర‌భాస్ మాత్రం  `బాహుబ‌లి` గెట‌ప్‌నే కంటిన్యూ చేశాడు. సినిమా  పూర్త‌య్యి కూడా చాలా రోజులైంది. ఇంకా ప్ర‌భాస్ స్టైల్ మార‌లేదేంట‌బ్బా అని అంతా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. మ‌రోప‌క్క సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు కూడా ఆయ‌న ఒప్పుకొన్నారు. కానీ ఎంత‌కీ `బాహుబ‌లి` స్టైల్ మార్చ‌క‌పోయేస‌రికి ర‌క‌ర‌కాల డౌట్లు వ్య‌క్త‌మ‌య్యాయి. బాహుబ‌లి2 పూర్త‌య్యాకే ప్ర‌భాస్ లుక్ ఛేంజ్ చేస్తాడేమో అనుకొన్నారు. కానీ ఎట్ట‌కేల‌కు ప్ర‌భాస్ త‌న లుక్‌ని ఛేంజ్ చేశాడు. `బాహుబ‌లి` హిందీ ట్రైల‌ర్ లాంఛ్‌కి నయా స్టైలిష్ లుక్‌తో ముస్తాబై హాజ‌ర‌య్యాడు. ప్ర‌భాస్ న‌యా గెట‌ప్ అదుర్స్ అనిపించేలా ఉంద‌ని ఆయ‌న అభిమానులు సంతోష‌ప‌డుతున్నారు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ