Advertisementt

‘నిలువవే వాలుకనులదానా’ ఆడియోకి సిద్ధం..!

Wed 03rd Jun 2015 12:02 AM
niluvave valukanuladana movie,audio release,arjun pravas,meher raj  ‘నిలువవే వాలుకనులదానా’ ఆడియోకి సిద్ధం..!
‘నిలువవే వాలుకనులదానా’ ఆడియోకి సిద్ధం..!
Advertisement
Ads by CJ

అవతార్‌ మెహర్‌ బాబా క్రియేషన్స్‌ పతాకంపై మెహెర్‌రాజ్‌, మనీషా జంటగా నటించిన చిత్రం ‘నిలువవే వాలుకనులదానా’!. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆడియోని జూన్‌ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అర్జున్‌ ప్రవాస్‌ మాట్లాడుతూ.. ‘నిర్మాణంలో రాజీ పడకుండా ఈ చిత్రాన్ని కేరళ, వైజాగ్‌, అరకులలోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో తెరకెక్కించాం. ముఖ్యంగా మెహర్‌రాజ్‌ నటన, అతను చేసిన డ్యాన్స్‌లు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు కలిసి చూడవలసిన అద్భుతమైన ప్రేమకథా చిత్రమిది. శాంతిసూర్యం అందించిన సంగీతం హృదయాల్ని అత్తుకుంటుంది. ముఖ్యంగా మా నిర్మాత అందించిన సహకారం మరువలేనిది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూన్‌ 7న ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఆడియోను విడుదల చేయనున్నాం. జూన్‌ నెలాఖరుకి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం...’ అన్నారు. 

మెహర్‌రాజ్‌, మనీషా హీరోహీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రానికి కథ: శ్రావణ్‌ మక్కేన , ఎడిటింగ్‌: నందమూరి హరి, ఛాయాగ్రహణం: మనోహర్‌ కొల్లి, శేఖర్‌, సంగీతం: శాంతిసూర్యం, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: యర్రం వెంకటరెడ్డి, సహనిర్మాతలు: డా॥ జివిఎస్‌ఆర్‌ కుమార్‌`విష్ణు లక్ష్మీనారాయణ` పి. శ్రీధర్‌, నిర్మాత: అవతార్‌ మెహర్‌ బాబా క్రియేషన్స్‌స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: అర్జున్‌ ప్రవాస్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ