Advertisementt

మఫియాడాన్‌గా రజనీ..!!

Wed 03rd Jun 2015 02:14 AM
basha,rajinikanth,mafia don,ranjith  మఫియాడాన్‌గా రజనీ..!!
మఫియాడాన్‌గా రజనీ..!!
Advertisement
Ads by CJ

రజనీకాంగ్‌ మాఫియా డాన్‌గా నటించిన 'భాషా' చిత్రం ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మళ్లి ఇన్నాళ్లకు రజనీ మరోసారి డాన్‌ పాత్రలో కనిపించనున్నాడు. రజనీ తదుపరి చిత్రంపై కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఆయన తాజా చిత్రం ఖరారైంది. కలైపులిథాను నిర్మించనున్న ఈ సినిమాకు పా రంజిత్‌ దర్శకత్వం వహించబోతున్నట్లు రజనీ కుమార్తె సౌందర్య ట్విట్టర్‌ ద్వారా సమాచారం ఇచ్చింది.

వినూత్న కథ, కథనాలతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్ట్‌ నెలలో మలేషియాలో ప్రారంభించనున్నట్లు తెలిసింది. చెన్నై, థాయిలాండ్‌, బ్యాంకాక్‌ల్లో ఈ సినిమా షూటింగ్‌ కొనసాగనున్నట్లు సమాచారం. సంతోష్‌ నారయణన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి మురళీ కెమెరామన్‌గా బాధ్యతల్ని నిర్వహించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి డాన్‌గా కనిపించనున్న రజనీకాంగ్‌ను ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో వేచిచూడాల్సిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ