`గౌతమ్ ఎస్.ఎస్.సి`, `బాస్` తదితర చిత్రాలతో సందడి చేసిన బొద్దుగుమ్మ పూనమ్ బజ్వా గుర్తుందా? అవకాశాలు తగ్గినప్పటికీ... తెలుగు, తమిళం భాషల్లో అప్పుడప్పుడూ సందడి చేస్తూ ఉంటుంది. మలయాళంలో మాత్రం మాంచి జోరు కనబరుస్తోంది. త్రిషకి మంచి స్నేహితురాలైన పూనమ్ తాజాగా మరో తమిళ చిత్రంలో అవకాశం చేజిక్కించుకొంది. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కతున్న `అరణ్మణై` సీక్వెల్ సినిమాలో పూనమ్ కీలక పాత్ర పోషించేందుకు ఎంపికైంది. ఇందులో ఇప్పటికే త్రిష, హన్సిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రిష రెకమెండేషన్ వల్లే పూనమ్ ఎంపికైందని సమాచారం. తమిళంలో ఇప్పటికే `భోగి` అనే సినిమాలో నటిస్తున్న పూనమ్‌కి తాజా అవకాశం మరింత క్రేజ్‌ని పెంచేసింది. ఈ దెబ్బతో కెరీర్ మళ్లీ ఊపందుకొంటుందని ఆమె నమ్మకంగా ఉంది. ఆమధ్య తెలుగులో త్రిష, పూనమ్‌లతో ఎమ్మెస్ రాజు ఓ సినిమా మొదలుపెట్టారు. ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది కానీ... అది పూర్తయ్యుంటే పూనమ్ తెలుగులోనూ బిజీ అయ్యేదే.