హరీష్, జై, విష్ణు, కీర్తి, గీతాంజలి, కావేరి ప్రధాన పాత్రల్లో చింతల సురేందర్ యాదవ్ సమర్పణలో డైరెక్టర్ మంచి వెంకట్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి తిరుపతమ్మ ఫిల్మ్స్ పతాకంపై జేఎస్ రామారావు నిర్మిస్తున్న సినిమా 'టెన్త్ లో లక్, ఇంటర్ లో కిక్, బీటెక్ లో..?'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మంచి వెంకట్ మాట్లాడుతూ "ఈ సినిమా టైటిల్ ఎంత విభిన్నంగా ఉందో సినిమా కూడా అదే విధంగా ఉంటుంది. ఆడియో కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో నాలుగు పాటలు నాలుగు ఫ్లేవర్స్ తో ఉంటాయి. బిజినెస్ మెన్ స్పూఫ్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. టెన్త్ లో ఇంటర్ చదివిన విద్యార్థులు బీటెక్ లో వారు అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యారా లేదా కొన్నింటికి లోబడి జీవితాన్ని నాశనం చేసుకున్నారా అనే అంశాల మీద సినిమా రన్ అవుతుంటుంది. జూన్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఈ సినిమా విడుదల సందర్భంగా స్టూడెంట్స్ కు ఓ కాంటెస్ట్ నిర్వహించబోతున్నాం. ప్రేక్షకులు చిత్రం చూసిన తర్వాత ఆ టికెట్ నంబర్, పేరు టైప్ చేసి 9000660128 నంబర్‌కు ఎస్ఎమ్ఎస్ చేయాలి. ఎస్ఎమ్ఎస్ చేసిన వారిలో 10మంది లక్కి విన్నర్స్ ను ఎంపిక చేసి మొదటి విన్నర్‌కు ల్యాప్ టాప్, మిగతా తొమ్మది మందికి ప్రముఖ హీరోయిన్ చేతుల మీదుగా 9 స్మార్ట్ ఫోనులు అందజేస్తాం. చిత్రం విడుదలైన మూడు రోజుల వరకు ఈ కాంటెస్ట్ ఉంటుంది" అని తెలిపారు.
రవి మాట్లాడుతూ "టైటిల్ కు తగ్గట్టు మంచి కథాంశంతో తీసిన ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. కమెడియన్స్ పై ప్రత్యేకంగా ఓ పాటను పెట్టారు. ఇది చిన్న సినిమా అయినా క్వాలిటీ ఉన్న సినిమా. మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను"అని అన్నారు.
విష్ణు మాట్లాడుతూ "యూత్ ఓరియెంటెడ్ చిత్రమిది. బిటెక్ విద్యార్ధులకు సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. చిన్న సందేశం కూడిన వినోదాత్మక చిత్రం" అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : జేఎస్ రాజ్, సినిమాటోగ్రఫీ : జి. అమర్, కొరియోగ్రఫీ: శామ్యూల్, చిత్ర సమర్పకులు: చింతల సురేందర్ యాదవ్, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : మంచి వెంకట్.