అనుష్క ప్రధాన పాత్రలో టైటిల్ రోల్‌లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణీి గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి ద్విభాషా చిత్రం ‘రుద్రమదేవి’. ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి ఎన్నో డేట్స్ అనుకున్నప్పటికీ ఫైనల్‌గా జూన్ 26న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళ్‌లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ అదే రోజు విడుదలవుతోంది. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా జూన్ 26నే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రీ`రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇళయరాజా నేతృత్వంలో సింఫనీ ఆర్కెస్ట్రాతో 25 రోజులపాటు లండన్‌లో ఈ రీ`రికార్డింగ్ కార్యక్రమాలు జరిగాయి. లండన్‌లో రీ`రికార్డింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ‘రుద్రమదేవి’ కావడం విశేషం. ప్రస్తుతం అనుష్క దృష్టంతా విడుదలకు సిద్ధమైన రుద్రమదేవి, బాహుబలి చిత్రాలపైనే వుంది. ఈనెల రుద్రమదేవి, వచ్చే నెల బాహుబలి విడుదల అవుతుండడంతో ఈ రెండు చిత్రాల ఫలితాలపై అనుష్క చాలా కాన్ఫిడెంట్‌గా వుందట. రుద్రమదేవిలో ప్రధాన పాత్ర పోషించిన అనుష్క, బాహుబలిలో ప్రభాస్ సరసన నటించింది. ఒకవిధంగా చెప్పాలంటే బాహుబలి కంటే అనుష్కకు రుద్రమదేవి చిత్రమే ఎక్కువ ఇంపార్టెంట్. ఈ రెండు సినిమాలతో తన కెరీర్ కొత్త టర్న్ తీసుకుంటుందని అనుష్క గట్టిగా నమ్ముతోంది.