Advertisementt

ఫారిన్ లో 15 డాలర్లతో ‘సింగం 123’ చూడొచ్చు

Fri 05th Jun 2015 04:14 AM
telugu movie singham 123,singham 123 releasing in online,sampoornesh babu,manchu vishnu  ఫారిన్ లో 15 డాలర్లతో ‘సింగం 123’ చూడొచ్చు
ఫారిన్ లో 15 డాలర్లతో ‘సింగం 123’ చూడొచ్చు
Advertisement
Ads by CJ

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. హీరోగా నటిస్తూనే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ ను స్టార్ట్ చేసి కొత్త నటీనటులు, టెక్నిషియన్స్ కి అవకాశాన్ని కల్పిస్తున్నారు. తెలుగు సినిమాని ఖండాతరాలు దాటించి తెలుగు సినిమా మార్కెట్ ను పెంచుతున్నారు. గతంలో ‘అనుక్షణం’ సినిమాని ఆక్షన్ పద్ధతిలో విడుదల చేసి వైవిధ్యతను చాటుకున్న విష్ణు మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందిన చిత్రం ‘సింగం 123’. అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈచిత్రాన్ని ఆన్ లైన్ విధానంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 5న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఇండియాలో మినహా ప్రపచంలో ఎక్కడనుండైనా చూడాలనుకునేవారు 15 డాలర్లను ఆన్ లైన్ చెల్లించి చూడవచ్చు. ఈ విధానంతో తెలుగుసినిమాని ప్రపంచంలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు యంగ్ అండ్ డైనమిక్ మంచు విష్ణు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ