హృతిక్ రోషన్‌ని స్ఫూర్తిగా తీసుకున్నట్టున్నాడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న రాకేష్ రోషన్ తన వారసుడు హృతిక్‌ని హీరో చేశాడు. ఆయన ఇప్పుడు యాక్షన్ చిత్రాలతో దుమ్ము రేపుతున్నాడు. హృతిక్‌లాగే పూరి తనయుడు ఆకాష్ కూడా టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలు చేసి దుమ్ము రేపాలనుకొంటున్నాడట. 'ఆంధ్రా పోరి' సినిమాతో కథానాయకుడైన ఆకాష్ మరో మూడేళ్లపాటు సినిమాలకి దూరమవుతాడట. ఈలోగా బ్యాంకాక్ వెళ్లి యాక్షన్, అమెరికా వెళ్లి యాక్టింగ్‌లోనూ శిక్షణ తీసుకొంటాడట. ఆ తర్వాత తన తండ్రి దర్శకత్వంలోనే ఓ యాక్షన్ సినిమా చేస్తాడట. పూరి కూడా తన కొడుకు అభిరుచి మేరకు ఒక యాక్షన్ కథని సిద్ధం చేస్తాడట. బహుశా ఆ చిత్రం 2019 ప్రేక్షకుల ముందుకు రావొచ్చేమో! ఆకాష్ పూరి కథానాయకుడిగా నటించిన ఆంధ్రాపోరి ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.