Advertisementt

'జ్యోతిలక్ష్మి' ఆడియో విడుదల..!

Fri 05th Jun 2015 06:19 AM
jyothi lakshmi,audio launch,poori jagannath,c.kalyan,charmi  'జ్యోతిలక్ష్మి' ఆడియో విడుదల..!
'జ్యోతిలక్ష్మి' ఆడియో విడుదల..!
Advertisement
Ads by CJ

ఛార్మి ప్రధానపాత్రలో ఛార్మి కౌర్‌ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్మెంట్‌ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్‌ బ్యానర్స్‌పై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్‌, తేజ్‌, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ జూన్ 4న హైదరాబాద్‌లోనిజె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నడుమ వైభవంగా జరిగింది. దర్శకుడు పూరిజగన్నాథ్ బిగ్‌ సీడీని ఆవిష్కరింఛి తొలి సి.డి.ని నిర్మాత సి.కళ్యాన్ కు అందించారు. సునీల్ కశ్యప్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో పూరి సంగీత్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా.. దర్శకుడు పూరిజగన్నాథ్ మాట్లాడుతూ " జ్యోతిలక్ష్మి నాకు బాగా ఇష్టమైన కథ. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన ప్రసిద్ద నవల 'మిసెస్ పరాంకుశం' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాను. ఆరు సంవత్సరాలుగా చార్మి ప్రాధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాను. సినిమాలో చార్మి అధ్బుతంగా నటించింది. కళ్యాన్ గారితో మొదటిసారిగా ఈ సినిమాకి వర్క్ చేసాను. ఆయనతో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాను. సునీల్ కశ్యప్ గారి సంగీతం, భాస్కర్ భట్ల గారు రాసిన పాటలు ఫెంటాస్టిక్ గా వచ్చాయి. విందా చాలా తక్కువ సమయంలో మంచి ఫోటోగ్రఫీ ఇచ్చాడు. హీరో సత్య కు మొదటి సినిమా అయినా బాగా నటించాడు. ప్రస్తుతం 'ఆటోజాని' సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాను" అని అన్నారు. 

సి.కళ్యాన్ మాట్లాడుతూ "పూరి గారితో ఏడు సంవత్సారాల క్రితమే సినిమా చేయాలనుకున్నాను కాని ఇప్పటికి కుదిరింది. 'జ్యోతిలక్ష్మి' ఓ యూత్ ఫుల్, ఎమోషనల్, రొమాంటిక్ తో కూడిన డ్రామా. ఈ సినిమాలో ఓ డిఫరెంట్ షేడ్ లో ఛార్మి ను చూడబోతున్నారు. భాస్కర్ భట్ల మంచి లిరిక్స్ అందించారు. సునీల్ మ్యూజిక్ అధ్బుతంగా ఉంది. టెక్నీషియన్స్ అందరు ఎంతగానో సహకరించారు. సినిమా క్రెడిట్ అంతా పూరి గారికే దక్కుతుంది. ప్రొడ్యూసర్ గా ఎంజాయ్ చేస్తూ చేసిన మొదటి చిత్రమిది. సినిమా మంచి సక్సెస్ ను సాధించి మా జర్నీ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.

చార్మి మాట్లాడుతూ "ఆడియోకి ముందు రిలీజ్ చేసిన జ్యోతి లక్ష్మి సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని భావిస్తున్నాను. సినిమా కంప్లీట్ అవ్వడానికి తెర వెనుక సిబ్బంది చాలా కష్టపడతారు. వారందరికీ నా ధన్యవాదాలు" అని చెప్పారు.

సునీల్ కశ్యప్ మాట్లాడుతూ "సినిమాలో ప్రతి పాట, లిరిక్స్ చాలా పద్దతిగా ఉంటాయి. భాస్కర్ భట్ల మంచి సాహిత్యాన్ని అందించారు. నాకు సహకరించిన సింగర్స్ అందరికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

సత్య మాట్లాడుతూ "ఈ సినిమాకు పవర్ హౌస్ చార్మి. అంత అధ్బుతంగా నటించారు. సునీల్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పూరి గారికి నా ధన్యవాదాలు'' అని చెప్పారు.

సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ "సినిమాలో చార్మి గారు అధ్బుతంగా పెర్ఫార్మ్ చేసారు. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాలో నేను నటించడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.

భాస్కర్ భట్ల మాట్లాడుతూ "మహిళల ఆత్మ గౌరవానికి, ఆత్మాభిమానానికి సంబంధించిన సినిమా ఇది. పూరి గారితో నేను చేసిన 23వ సినిమా ఇది. ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాతో సునీల్ మంచి మార్క్ సంపాదించుకొని సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ