Advertisementt

'where is విద్యాబాలన్' ఆడియో విడుదల..!

Sat 06th Jun 2015 10:47 PM
where is vidhyabalan,audio release,prince,sreenivas  'where is విద్యాబాలన్' ఆడియో విడుదల..!
'where is విద్యాబాలన్' ఆడియో విడుదల..!
Advertisement
Ads by CJ

ప్రిన్స్, జ్యోతిసేథ్ జంటగా క్రిష్ణ బద్రి అండ్ శ్రీధర్ రెడ్డి సమర్పణలో శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ దర్శకత్వంలో ఎం.శ్రీనివాస్ కుమార్ రెడ్డి, ఎల్.వేణుగోపాల్ రెడ్డి, పి.లక్ష్మినరసింహరెడ్డి, ఆలూరి చిరంజీవి సంయుక్తంగా నిర్మించిన సినిమా 'where is విద్యాబాలన్?'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ ఆడియో ఆవిష్కరించి మొదటి సిడిను దర్శకుడు శ్రీనివాస్ కు అందించారు. కమ్రాన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది. ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "శ్రీనివాస్ గారికి ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలి. అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ చేసారు. సినిమాలో పాటలు బావున్నాయి. సినిమా మంచి సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ "ఇదొక రొమాంటిక్, కామెడీ చిత్రం. టైటిల్ చాలా కొత్తగా ఉంది. సినిమా ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. ప్రొడ్యూసర్స్ కి ఈ సినిమా మంచి లాబాలు తెచ్చిపెట్టాలి" అని చెప్పారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ "టీజర్, ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత అధ్బుతంగా వచ్చిందో తెలుస్తుంది. సినిమా టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.

డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ "ఇదొక కామెడీ ఫిల్మ్. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. కమ్రాన్ రీరికార్డింగ్ లో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్ మాట్లాడుతూ "చాలా సినిమాలకు రీరికార్డింగ్ అందించాను. మొదటిసారి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాను. కాసర్ల శ్యాం, యాదగిరి గారు మంచి సాహిత్యాన్ని అందించారు. ఆడియోకు, సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.  

నిర్మాత లక్ష్మీనరసింహరెడ్డి మాట్లాడుతూ "సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

హీరో ప్రిన్స్ మాట్లాడుతూ "అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రమిది. కెమెరామెన్ చిట్టిబాబు నన్ను చాలా అందంగా చూపించారు. డైరెక్టర్ గారు చిత్రాన్ని అధ్బుతంగా తెరకెక్కించారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జయప్రకాశ్ రెడ్డి, రావు రమేష్, సాంబ శివరావు, జ్యోతి సేథ్, మధునందన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: కమ్రాన్, పాటలు: కాసర్ల శ్యాం, వరికుప్పల యాదగిరి, ఎడిటింగ్: మధు, కెమెరా:చిట్టిబాబు.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ