అజ్మల్, నికితా నారాయణ్ జంటగా నికిత శ్రీ సమర్పణలో డి.వి.సినీ క్రియేషన్స్ పతాకంపై వంశి దర్శకత్వంలో డి.వెంకటేష్ నిర్మిస్తున్న సినిమా 'మెల్లగా తట్టింది మనసు తలుపు'. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ సోమవారం హైదరాబాల్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ "నాకు ఇష్టమైన దర్శకులలో వంశి గారు ఒకరు. ఆయన సినిమాను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కుటుంబ విలువలున్న చిత్రమిది. ఈ సినిమా నా సన్నిహితులకు చూపించాను. అందరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కు కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చిన వంశి గారికి ధన్యవాదాలు" అని చెప్పారు.
దర్శకుడు వంశి మాట్లాడుతూ "మధ్యలోనే ఆగిపోయిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత వెంకటేష్ గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని చెప్పారు.
వెన్నెలకంటి మాట్లాడుతూ "వంశి తో గతంలో కొన్ని సినిమాలకు పని చేసాను. ఈ సినిమా కోసం నన్ను టైటిల్స్ రాయమని చెప్పగా పది టైటిల్స్ ను రాసి ఇచ్చాను. 'మెల్లగా తట్టింది మనసు తలుపు' అనే టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నారు. వెంకటేష్ గారు అభిరుచి ఉన్న నిర్మాత. తనకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
అజ్మల్ మాట్లాడుతూ "వంశి గారు తెలుగు సంప్రదాయాలు ఉండేలా చిత్రాలను తెరకెక్కిస్తారు. ఆయన దర్శకత్వంలో పని చేయడం ఆనందంగా ఉంది" అని చెప్పారు.
నికిత మాట్లాడుతూ "వంశి గారిలో వెరైటీ స్టైల్ ఉంటుంది. టైటిల్ ఎంత కూల్ గా ఉందో సినిమా కూడా అలానే ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ సినిమా. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్.వి. సుబ్బు, దర్శకుడు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కథ: మల్లాది వెంకట కృష్ణమూర్తి, మాటలు: చందు, పాటలు: ప్రవీణ్ లక్మ, ఫోటోగ్రఫీ: ఎమ్.వి.రఘు