Advertisementt

'శ్రీ కె.వై.క్రియేషన్స్' చిత్రం ప్రారంభం..!

Sat 13th Jun 2015 07:39 AM
ky creations,palik,manjula,k.y.sekhar babu,hemanth  'శ్రీ కె.వై.క్రియేషన్స్' చిత్రం ప్రారంభం..!
'శ్రీ కె.వై.క్రియేషన్స్' చిత్రం ప్రారంభం..!
Advertisement
Ads by CJ

హేమంత్, విజయ్, శ్రీనివాస్, రామ్ తేజ్ ప్రధాన పాత్రల్లో పాలిక్ దర్శకత్వంలో కె.వై.శేఖర్ బాబు నిర్మాణంలో  'శ్రీ కె.వై.క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్2' చిత్ర ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి శ్రీ ఎరోజు వెంకటాచారి క్లాప్ కొట్టగా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ "ప్రస్తుతం మాఫియాలా మారిన సొసైటీ మారే పరిస్థితుల్లో లేదు. సమాజాన్ని మార్చే ధ్యేయంతో మీడియా సహాయంతో ఓ నలుగురు కుర్రాళ్ళు ఎలాంటి సాహసాలు చేసారనేదే ఈ కథ. ఈ సినిమాలో జర్నలిస్ట్ క్యారెక్టర్ కీలకమైనది. రెగ్యులర్ షూటింగ్ జూలై మొదటివారం నుండి నిర్వహించనున్నాం. చెన్నై, గోవా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నాం. ఆగస్టులో పాటల షూటింగ్ జరగనుంది" అని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మంజుల మాట్లాడుతూ "పాలిక్ గారు చెప్పిన కథ నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఓ నలుగురు యువకుల కథ ఇది. మంచి సందేశాత్మక చిత్రమిది" అని చెప్పారు. 

నిర్మాత కె.వై.శేఖర్ బాబు మాట్లాడుతూ "ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మాఫియాను తరిమి కొట్టడానికి మీడియాను ఆదారంగా చేసుకోవడమే ఈ సినిమాలో మెయిన్ పాయింట్" అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు: నేతాజీ, పాటలు: బండారు దానయ్యకవి, సంగీతం: బందరు దానయ్య కవి, కెమెరా: రంజిత్ మొగుసాని, ఆర్ట్: శేఖర్, ప్రొడ్యూసర్: కె.వై.శేఖర్ బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సి.మంజుల, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పాలిక్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ