కొత్త కథానాయికల్ని తెలుగు తెరపైకి తీసుకురావడంలో ముందుంటాడు పూరి జగన్నాథ్. ఈసారి ఆయన కన్ను ఓ అందాల భామపై పడింది. మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచి గ్లామర్ వరల్డ్‌ని ఆకర్షిస్తున్న దిశాపటానీని తన తదుపరి చిత్రంతో తెరకు పరిచయం చేయబోతున్నాడు పూరి. మెగా హీరో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా మొదలవ్వబోతోంది. సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. సిక్స్‌ఫీట్ హైటున్న వరుణ్ కోసం ముంబై వెళ్లి అందాలభామ దిశాని ఎంపిక చేసుకొచ్చాడు పూరి. కాస్త సన్నగా అనిపించినా వరుణ్‌కి తగ్గట్టుగా మాంచి హైటు మీద ఉంటుందట దిశా. కథ ఓకే, కథానాయిక కూడా ఓకే కాబట్టి త్వరలోనే సినిమాని మొదలుపెట్టబోతున్నారు.