ఆర్తి అగర్వాల్, ముకుల్ దేవ్ ప్రధాన పాత్రల్లో ఖాన్ ప్రొడక్షన్స్ ప్రై లిమిటెడ్ బ్యానర్ పై టైమ్ మీడియా సమర్పణలో భరత్ పారేపల్లి దర్శకత్వంలో ఎన్.ఎ.ర్రహ్మాన్ ఖాన్ నిర్మిస్తున్న సినిమా 'ఆపరేషన్ గ్రీన్ హంట్'. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్స్ ను హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ "ఎంతో ఆనందంతో ఈ చిత్రాన్ని మొదలుపెట్టాం. రిలీజ్ చేసే సమయానికి ఆర్తి అగర్వాల్ మరణించడం బాధాకరమైన విషయం. ఈ చిత్రాన్ని ఆమెను చివరి చూపు చూసేలా ప్రేక్షకులకు అందివ్వనున్నాం" అని చెప్పారు.
నిర్మాత ఎన్.ఎ.ర్రహ్మాన్ ఖాన్ మాట్లాడుతూ "నక్సలిజాన్ని పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన బృందం పేరు 'ఆపరేషన్ గ్రీన్ హంట్'. మేము చెప్పాలనుకున్న విషయాలను సినిమా ద్వారా చెప్తున్నాం. ఇదొక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అని చెప్పారు.
అశోక్ కుమార్ మాట్లాడుతూ "ఇదొక రివల్యూషన్ సినిమా. సమజాన్ని బాగుపరచాలనే ఉద్దేశ్యంతో కొందరు అడవుల్లో ఉండి పోరాడి ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అలా కాకుండా జనజీవన స్రవంతిలో కలిసి సమాజ శ్రేయస్సు కోసం పోరారడమే ఈ చిత్ర ఇతివృత్తం" అని చెప్పారు.
సాగరిక మాట్లాడుతూ "ఖాన్ ప్రొడక్షన్స్ లో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
అల్ల రాంబాబు మాట్లాడుతూ "సినిమా బాగా వచ్చింది. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
శివపార్వతి మాట్లాడుతూ "ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఆర్తి లేకపోవడం వెలితిగా, బాధగా ఉంది. ఇదొక సందేశాత్మక చిత్రం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కాజా సూర్యనారాయణరావు, నరసింహారెడ్డి, కాదంబరి కిరణ్, శివాజీరాజా, శ్రీరాహుల్, మోహన్ వడ్లపట్ల, సత్యరెడ్డి రుద్రమరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.