సూర్య, హరి కాంబినేషన్‌లో వచ్చిన సింగం, సింగం2 చిత్రాలు ఎంతగా ప్రేక్షకాదరణ పొందాయో అందరికీ తెలిసిందే. సింగం చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేశారు. ఇప్పుడు సింగం3 చిత్రం కోసం సూర్య, హరి రెడీ అవుతున్నారు. దాదాపు 9 నెలలపాటు ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేసి ఫైనల్ చేశాడు హరి. స్క్రిప్ట్ పట్ల సూర్య కూడా చాలా సంతృప్తిగా వున్నాడట. సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవుతుంది. తమిళనాడులోని కొన్ని ప్రదేశాలతోపాటు గోవా, ఫ్రాన్స్‌లలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. పర్టిక్యులర్‌గా ప్యారిస్‌లో ఎక్కువ భాగాన్ని షూట్ చేస్తారట. సింగం, సింగం2 చిత్రాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందించగా, మూడో భాగానికి కొలవరి ఫేమ్ అనిరుధ్ రవీందర్ మ్యూజిక్ చెయ్యబోతున్నాడు. ఈ చిత్రంలో అనుష్క, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తారు. నాజర్, రాధారవిలతోపాటు మరికొంత మంది ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో నటిస్తారు. సింగం, సింగం2 చిత్రాల కంటే ఈ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని హరి చెప్తున్నాడు. ఈమధ్యకాలంలో సరైన హిట్ లేని సూర్య ఈ సినిమా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. తెలుగులో కూడా రిలీజ్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ హరి.