ఇప్పటివరకు ఎన్నో గ్లామర్ రోల్స్‌లో అందరు ప్రముఖ హీరోల సరసన నటించిన త్రిష ఇప్పుడు ఓ కొత్త అవతారంలో కనిపించబోతోంది. రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటిస్తూ నిర్మిస్తున్న ‘చీకటి రాజ్యం’ చిత్రంలో ఫస్ట్ టైమ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా త్రిష నటిస్తోంది. అంతేకాకుండా కమల్‌హాసన్‌తో త్రిషకి ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడ వుందట. రెండు గంటల నిడివి వుండే ఈ సినిమాలోని ఎక్కువ భాగం కథ ఒక పబ్‌లోనే నడుస్తుందట. సూపర్ ఫాస్ట్‌గా వుండే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష చేస్తున్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా కీలకమైందిగా చెప్తున్నారు. త్రిష ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్‌లో ఈ సినిమాలో చేస్తున్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ స్పెషల్ కాబోతోంది. హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా జరిగిన షెడ్యూల్‌లో సినిమాకి సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందట. మిగతా షూటింగ్ అంతా చెన్నైలో ప్లాన్ చేశారు.
ప్రకాష్‌రాజ్, సంపత్‌రాజ్, యుగిసేతు, మధుశాలినిలతోపాటు మరికొంతమంది ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కనిపిస్తారు. జూన్, జూలై నెలల్లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఆగస్ట్‌లో రిలీజ్ చెయ్యాలన్నది కమల్‌హాసన్ ప్లాన్. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా కమల్‌హాసన్ కెరీర్‌లో మరో స్పెషల్ మూవీగా నిలుస్తుందని డైరెక్టర్ రాజేష్ చెప్తున్నాడు.