Advertisementt

మూడు నెలలు ఒకే సినిమాకి మహేష్‌ డేట్స్‌.!

Thu 18th Jun 2015 11:50 AM
mahesh latest movie srimanthudu,srimanthudu releasing on 7th august,mahesh next movie brahmotsavam starts in july 2nd week  మూడు నెలలు ఒకే సినిమాకి మహేష్‌ డేట్స్‌.!
మూడు నెలలు ఒకే సినిమాకి మహేష్‌ డేట్స్‌.!
Advertisement
Ads by CJ

మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని ఆగస్ట్‌ 7న అతని బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేయబోతున్నట్టు ఈరోజు ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించి బ్యాలెన్స్‌ వున్న ప్యాచ్‌ వర్క్‌ ఈనెలాఖరు కల్లా కంప్లీట్‌ అవుతుంది. జూలై 2వ వారం నుంచి మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందనున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ సినిమా కోసం మహేష్‌ కంటిన్యూగా ఎలాంటి బ్రేక్స్‌ లేకుండా 90 రోజులు డేట్స్‌ ఇచ్చాడట. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసి సంక్రాంతికి రిలీజ్‌ అయ్యేలా ప్లాన్‌ చెయ్యమని నిర్మాత పి.వి.పి.ని కోరినట్టు తెలుస్తోంది. 2016లో మహేష్‌ మరో రెండు సినిమాలు చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడట. అందుకే తను చేసే ప్రతి సినిమాని వీలైనంత త్వరగా కంప్లీట్‌ అయ్యేలా చూసుకుంటున్నాడు. ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో మహేష్‌ సరసన ఫస్ట్‌ టైమ్‌ ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. అయితే ఇప్పటివరకు మెయిన్‌ హీరోయిన్‌ ఎవరన్నది కన్‌ఫర్మ్‌ అవ్వలేదు. సెకండ్‌ హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌, మరో హీరోయిన్‌గా ప్రణీతలను ఓకే చేశారు. పూర్తిగా విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా రూపొందిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ పెద్ద విజయాన్ని సాధించింది. మరి మహేష్‌తో రెండో సినిమా చేస్తున్న శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రాన్ని ఏ రేంజ్‌ హిట్‌ చేస్తాడో చూడాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ