సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వివాదాస్పద అంశాలనే తన కథలుగా ఎంచుకుంటారు. దీంతో తన సినిమాకు పబ్లిసిటీకి పబ్లిసిటీతోపాటు కలెక్షన్లు కూడా భారీగా ఉంటాయి. తాజాగా రామ్‌గోపాల్ వర్మ దృష్టి స్మగ్లర్ వీరప్పన్‌పై పడింది. ఆయన జీవిత కథ ఆధారంగా ఆర్‌జీవీ రూపొందిస్తున్న 'కిల్లింగ్ వీరప్పన్' షూటింగ్ గురువారం నుంచి ప్రారంభమైంది.
గంధం చెక్కల స్మగ్లర్‌గా వీరప్పన్ అటు తమిళనాడు ఇటు కర్ణాటక రాష్ట్రాలకు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. దాదాపు రెండున్నర శతాబ్దాల పాటు ఆ రెండు రాష్ట్రాల పోలీసులకు కంటి మీద నిద్ర కరువు చేశాడు. ఆ తర్వాత వీరప్పన్ వేట కోసం ప్రత్యేకంగా నియమించిన దళం కొన్నేళ్లపాటు వెతికి చివరికి వీరప్పన్‌ను మట్టుబెట్టింది. వీరప్పన్‌ను చంపిన పోలీసుఫీసర్ ప్రధాన పాత్రలో వర్మ ఇప్పుడు చిత్రం రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది.